ఆంధ్రప్రదేశ్‌

ఎక్సైజ్ ఏసీ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 29: ఆబ్కారీశాఖ అసిస్టెంట్ కమిషనర్, ఇన్‌ఛార్జి డిప్యూటీ కమిషనర్ శివప్రసాద్‌ను బుధవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేసి, విశాఖపట్నం ఏసీబీ కోర్టుకు తరలించినట్టు డీఎస్పీ కరణం రాజేంద్ర తెలిపారు. మద్యం దుకాణాల లైసెన్స్‌దారుల నుంచి మామూళ్ల రూపేణా రూ.4.50 లక్షల రూపాయలు ఏసీ ఇంట్లో ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించి, ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ నెల 3న జరిగిన ఈ సంఘటన తర్వాత శాఖాపరమైన చర్యలు లేకపోవడం, అధికార పార్టీ ముఖ్యనేత ఆయనకు దన్నుగా నిలవడంతో శివప్రసాద్‌పై ఇక ఏసీబీ చర్యలు ఉండవనుకున్న లైసెన్స్‌దారులు మళ్లీ ఏసీబీ రాష్ట్ర ఉన్నతాధికారి ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లగా ఏసీ శివప్రసాద్‌ను అరెస్టు చేసి, ఏసీబీ కోర్టులో హాజరుపర్చాలంటూ ఇచ్చిన ప్రత్యేక సూచనల మేరకు బుధవారం ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర టీమ్ ఆయనను విశాఖ ఏసీబీ కోర్టుకు తరలించారు.