ఆంధ్రప్రదేశ్‌

ఇసుక మాత్రమే దక్కింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 30: గోదావరి నదిలో డ్రెడ్జింగ్ ప్రక్రియ అసలు ప్రయోజనాన్ని వదిలి, కొసరు ఫలితాన్నిచ్చింది. నదిలో పెరిగిపోయిన ఇసుక మేటలను తొలగిస్తే కాటన్ బ్యారేజీ వద్ద నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, ఏటా రబీలో ఎదురవుతున్న సాగు నీటి సమస్యను అధిగమించవచ్చని ప్రభుత్వం భావించింది. అయితే డ్రెడ్జింగ్ జరిగినప్పటికీ,. కేవలం కొన్ని ప్రభుత్వ శాఖల ఇసుక అవసరాలు తీరడం మినహా అతి ముఖ్యమైన నీటి నీల్వ సామర్థ్యం పెంపు ప్రయోజనం సిద్ధించలేదు. దీనితో ప్రస్తుత రబీ సీజనులో నీటి సమస్య ఏటా మాదిరిగానే యథాతథంగా ఉంది. గోదావరి నదిలో పెరిగిపోయిన ఇసుక దిబ్బలను, మేటలను తొలగించడం ద్వారా నదీ గమన దిశలు సవ్యంగా ఉంటాయని, కాటన్ బ్యారేజి వద్ద నదీ లోతు పెరిగి, నిల్వ సామర్థ్యం పెరుగుతుందని డ్రెడ్జింగ్ ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.16.52 కోట్ల విలువైన ఈ టెండర్‌ను ఓషన్ స్పార్క్లే ఇండియా ప్రైవేటు లిమిడెడ్ సంస్థ దక్కించుకుని డ్రెడ్జింగ్ నిర్వహించింది. ఆరు నెలల కాలంలో 60 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను డ్రెడ్జింగ్ చేయాల్సివుంది. మొత్తం మీద ఏదోవిధంగా డ్రెడ్జింగ్ పూర్తిచేశారు. అయితే డ్రెడ్జింగ్ ద్వారా లభించే ఇసుకను వ్యాపార దృక్పథంతో వినియోగించుకోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత, సరైన సమయంలో నిర్వహించి నదీ లోతును పెంచుకోవడానికి మాత్రం ఇవ్వలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరదల సమయంలో నదిలో దిబ్బలను, మేటలను తొలగిస్తే లోతు పెరిగి, అప్పట్లో ఉండే అధిక నీటిని కాస్త ఎక్కువగా నిల్వ చేసుకుని రబీ సమయంలో ఉపయోగించుకునే అవకాశముండేది. వరదల సమయంలో ర్యాంపులన్నీ మూతపడటం వల్ల ఇసుకకు ఎక్కడలేని ధర పలుకుతుంది. ఆ సమయంలో డ్రెడ్జింగ్ నిర్వహిస్తే లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులోకి వచ్చి, ధర పెరిగే అవకాశముండదు. అందువల్ల ఇసుక మాఫియా కదిపిన పావుల కారణంగానే వరదల సమయంలో డ్రెడ్జింగ్ జరగలేదనే విమర్శలున్నాయి. యంత్రాలు తెచ్చి గోదావరి నదిలో సిద్ధంచేసిన దాదాపు ఆరు నెలలకు గానీ డ్రెడ్జింగ్ చేపట్టలేదంటే ఇందులో ఉన్న మర్మం అర్ధమవుతోందనే వాదన లేకపోలేదు. అనంతరం ధవళేశ్వరం వద్ద డ్రెడ్జింగ్ చేపట్టి ఆ ఇసుకను పిచ్చుకలంక పర్యాటక ప్రాజెక్టును ఎత్తుచేసేందుకు వినియోగించారు. ఆ తర్వాత కోటిలింగాలపేట వద్ద డ్రెడ్జింగ్ చేసిన ఇసుకను నిల్వచేసి అధికారులు విక్రయాలు జరిపారు. దీనివల్ల నిర్దేశిత పరిమాణంలో ఇసుకను డ్రెడ్జింగ్ చేసినప్పటికీ, అధికంగా నీటిని నిల్వచేసుకునే అవకాశం లేకపోయిందనే వాదన వినిపిస్తోంది. కాగా ఇసుకను వినియోగించుకున్నందుకు పర్యాటక శాఖ నుంచి జలవనరుల శాఖకు దాదాపు రూ.15 కోట్లు రావాల్సివుంది. ఈ నిధులు రాబట్టిన తర్వాత నదిలో మరింతగా డ్రెడ్జింగ్ నిర్వహించాలని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. అయితే ఈలోగా నగరపాలక సంస్థ పరిధిలోని స్నాన ఘట్టాల్లో పూడికతీయడానికి తాజాగా డ్రెడ్జింగ్ చేపట్టారు. ఆ ఇసుకను గృహ నిర్మాణ పథకాలకు వినియోగిస్తున్నారు.