ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబుతో ఉండే అర్హత గుర్నాథరెడ్డికి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), నవంబర్ 30: కబ్జాలు...హత్యలు...సెటిల్‌మెంట్‌లు చేసుకునే వ్యక్తికి నేడు చంద్రబాబు పక్కన కూర్చోనే ఆర్హత లేదని పరోక్షంగా మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డిని ఉద్దేశించి అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం లాబీల్లో వైకాపా ఎమ్మెల్యేలు చేరిక, పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య గురువారం అసక్తికర సంభాషణ జరిగింది. ఎంపీ జెసి దివాకరరెడ్డి వర్గం కాబట్టే నేడు గుర్నాథరెడ్డిని పార్టీలోనికి ఆహ్వానిస్తున్నారని, నిఖార్సుగా ఉంటే నేటి రోజుల్లో లాభం లేదని శాసన సభ్యుడు వి ప్రభాకర్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి తెదేపాలో చేరే సమయంలో తాను మాత్రం హాజరు కానని కరాఖండిగా చెప్పారు. గుర్నాథరెడ్డితో తాను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఫోటో దిగనన్నారు. ఇప్పటి వరకు ఆయన ఆరాచకాలపైనే పోరాడామని, ఇప్పుడు ఏవరిపై పోరాడాలని ప్రశ్నించారు. ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క గంట కూడా వదల కుండా హాజరైయినట్లు తెలిపిన ఆయన బుధవారం అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే వెళ్లిపోయానన్నారు. అవకాశవాద రాజకీయాలు చేసే గురునాథరెడ్డి 250 కోట్ల రూపాయల అక్రమ అస్తులు సక్రమం చేసుకునేందుకే తెదేపాలో చేరినట్లు చెప్పారు. మొదటి నుంచి ఆయన రాకను వ్యతిరేకిస్తున్నామని జేసీ గ్రూప్ వ్యక్తి అయినందునే పార్టీలోనికి తీసుకుంటున్నట్లు చెప్పారు. జేసీ ప్రభాకరరెడ్డి తప్ప జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా ఆయనకు లేదన్నారు.