ఆంధ్రప్రదేశ్‌

మహిళలకు సమాన హక్కుల కోసం విప్లవాత్మక మార్పు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), నవంబర్ 30: ఇప్పటి వరకు ఆడవాళ్ళు మగవారిపై ఆధారపడి ఉండే వారని, కాని నేడు మారుతున్న పరిస్థితుల్లో స్ర్తి తన శక్తిన్ని అన్నింటా పెంచుకోవడంతో అడవారిపై మగవారు ఆధారపడే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. సమాజంలో మహిళలకు సమాన హక్కుల కోసం విప్లవాత్మక మార్పులు రావాల్సి ఉందని అభిప్రాయపడిన ఆయన మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోనికి వస్తే వారి ఆత్మగౌరవం మరింత పెరుగుతుందన్నారు. ప్రస్తుత రోజుల్లో స్ర్తిలు చూపుతున్న తెగువ, ప్రతిభ, శక్తులను ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏపీ శాసనసభా సమావేశాల్లో భాగంగా గురువారం మహిళా సాధికారత, అమరావతి డిక్లరేషన్, చట్టసభల్లో మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్లపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ర్తి శక్తిని నాడే గ్రహించిన ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కుతో పాటు వారి విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసి చూపించారని గుర్తు చేశారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని, తన మానస పుత్రికగా డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రారంభించిన కొత్తలో ఎందరో వ్యతిరేకించడంతో పాటు కించపరిచారని, కాని మొక్కవోని దీక్షతో మహిళలు ముందుకు వచ్చి సభ్యులుగా చేరి, నేడు ఆర్థిక ప్రగతి సాధించారని తెలిపారు. తన మానస పుత్రిగా ఉన్న డ్వాక్రా సంఘంలోని మహిళలు నేడు ప్రభుత్వ పథకాలను వారి బాధ్యతగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేటి సమాజంలో గర్వంగా తలెత్తుకుని ఇంటి బాధ్యతలతో పాటు మహిళలు ప్రభుత్వ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకు వచ్చేందుకు వారికోసం ప్రత్యేకంగా పలు పథకాలను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. దీనిలో భాగంగానే ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు, ప్రత్యేక ఐజీని నియమించడంతో పాటు వారి ఆత్మగౌరవం కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మరుగుదోడ్లను నిర్మించి, దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్‌లు అందించినట్లు చెప్పారు. వీటితో పాటు విద్యార్థి దశలో వారిని ప్రోత్సహించేందుకు సైకిళ్లు, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి పెళ్ళిళ్ల సమయంలో నగదు ప్రోత్సాహాలు అందిస్తున్నట్లు తెలిపారు. మహిళా పారిశ్రామిక వేత్తలుగా వారిని తీర్చిదిద్దేందుకు ఆవసరమైయితే ప్రత్యేక టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతి డిక్లరేషన్‌లోని కొన్నింటిని ఇప్పటికే రాష్ట్రంలో అమలు చేస్తున్నామని, భవిష్యత్‌లో అన్నీ అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలుస్తామన్నారు. వీటిపై మూడు నెలలకు ఒకసారి సమీక్షను కూడా నిర్వహిస్తామని తెలిపారు. మహిళా సాధికారత సాధించడం, వారి ఆత్మాభిమానం కాపాడటం, సమాజంలో ఉన్నత స్థానానికి చేరేలా వెన్నుతట్టి ప్రోత్సహించడంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. చట్టసభల్లో మహిళలకు పెద్ద ఎత్తున చోటు దక్కేలా చట్టపరమైన చర్యలు అవసరమని ఇందుకు రిజరేషన్ల బిల్లు దోహదపడుతుందన్నారు. ఎన్నో ఏళ్లుగా కాగితాలకే పరిమితమైన అంశం కార్యరూపం దాల్చి వారి స్వప్నాన్ని సాకారం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ చర్చలో భాగంగా ఎమ్మెల్యేలు పీతల సుజాత, కిమిడి మృణాళిని, ఉప్పులేటి కల్పన, గిడ్డి ఈశ్వరి, యామినీ బాల, అనితతో పాటు స్ర్తి శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత ప్రసంగించారు.