ఆంధ్రప్రదేశ్‌

యువత వినూత్న ఆలోచనలతోనే దేశ పునర్నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, నవంబర్ 30: సమిష్టిగా ఆలోచించాలి..కొంగొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాలి. ఉరకలెత్తే యువత ఆలోచనలకు ప్రోత్సాహం అందిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. యువత సాధించలేనిది ఏదీలేదు. ఇందుకు వారిని చైతన్యం చేయడం ఒక ఆయుధం. వారిలో ఆలోచనలను బయటకు రప్పించి, వారిని కార్యోన్ముఖులను చేయగలిగితే అద్భుతాలు సృష్టిస్తారు. ఈ పనికి శ్రీకారం చుటి, ప్రపంచ యువతకు వేదికగా నిలిచింది అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ. ప్రపంచ వాప్తంగా పది దేశాల నుంచి 62 విద్యాసంస్థల నుంచి 229 మంది విద్యార్ధులకు వారం రోజుల పాటు శాన్‌ఫ్రాన్సిస్కోలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ హాస్సాం ఫ్లాధర్ డి స్కూల్ వేదికయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి తైడా ఉదయ్‌సాయి (సిఎస్‌ఇ మూడో సంవత్సరం), సాలా తపశ్వినీలకంఠ ఫణికుమార్ (ఇఇఇ మూడో సంవత్సరం), రావుల నాగమణి (ఇసిఇ, చివరి సంవత్సరం), శ్రీపాద సత్యరమ్య (సిఎస్‌ఇ, చివరి సంవత్సరం) ఈ అపురూప కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు జరిగిన ఇంటెర్న్‌షిప్ ఫాల్‌లో పాల్గొనివచ్చిన వారు గురువారం కళాశాలలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో అక్కడి విశేషాలను వివరించారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన యువత ఒకేచోట చేరడంతో ఊహించని అనుభూతికి లోనయ్యామన్నారు. ముందుగా గూగూల్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన సమ్మేళనంలో ప్రతీ యువకుడు మరో దేశానికి చెందిన యువతితో అర్ధగంట పాటు స్నేహపూర్వక సంభాషణలు చేశామని, ఆలోచనతో ఒక్కొక్కరు తమ భావాలను పంచుకోగలిగామన్నారు. తాము చైనా లండన్, మలేషియా, మెక్సికో దేశాల యువతతో తమ భావాలను పంచుకున్నామని తెలిపారు.