ఆంధ్రప్రదేశ్‌

పర్యాటక ప్రాజెక్టులకు ఏకగవాక్ష విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 30: పర్యాటక ప్రాజెక్టులను వేగవంతం చేసే క్రమంలో ఏకగవాక్ష విధానాన్ని మరింత సరళీకరించి అన్ని అనుమతులు సత్వరం పొందగలిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా ఆదేశించారు. పర్యాటక పెట్టుబడిదారులు తమ అనుమతుల కోసం వివిధ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఎదురు కాకుండా, ఏకగవాక్ష విధానాన్ని మరింత పటిష్ఠపరచాలని సూచించారు. ఈ క్రమంలో ముగ్గురు అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. గురువారం వెలగపూడి సచివాలయంలో పర్యాటక శాఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎపిటిడిసి ఎండి, ఎంపీటీఏ సీఈఓ హిమాను శుక్లాతో సహా పర్యాటక శాఖలోని వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు, కన్సల్టెంట్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ పర్యాటక శాఖలోని వివిధ ప్రాజెక్టులు, ప్రాజెక్టుల వారీగా అవసరమైన అనుమతులకు సంబంధించి సవివరమైన నివేదిక సిద్ధం చేయాలన్నారు. విభిన్న అంశాలకు సంబంధించి డాక్యుమెంటేషన్ అవసరమని ప్రధానంగా ఈవెంట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం ముందుగానే విభిన్న వర్గాలు, మీడియాకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇది భవిష్యత్తు అవసరాలకు మార్గదర్శకంగా ఉంటుందన్నారు. మరోవైపు పర్యాటక ఆస్తులకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా భద్రపరచాలని ఆదేశించారు. ఈ విషయానికి సంబంధించి గత సమావేశాలలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ తదుపరి చర్యలు చేపట్టటంలో అలసత్వం వహించటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ విభాగాలకు, పర్యాటక శాఖకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించి పనితీరు ప్రదర్శించాలని, ప్రత్యేకించి పెట్టుబడిదారులను ఆకర్షించటం వంటి విషయాలలో అలసత్వం ప్రదర్శిస్తే వారు ఇతర రాష్ట్రాల వైపు మొగ్గు చూపుతారన్నారు. ప్రతినెలా నిర్దేశిత లక్ష్యాల మేరకు పనిచేసి ఆ నెలలో ఏ మేరకు ప్రాజెక్టు పనులను గ్రేడింగ్ చేయించగలిగామన్న దానిపై స్పష్టమైన సమాచారం సిద్ధంగా ఉండాలన్నారు. గ్రామీణ పర్యాటకాన్ని అభివృద్ధి చేసే క్రమంలో నూతనంగా చేపట్టిన సంస్కృతి ప్రాజెక్టుకు విస్తృత ప్రచారం అవసరమని, తక్షణమే విశాఖ వేదికగా టూర్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించాలని ఎఏపీటీఎ సీఈఓ శుక్లాను ఆదేశించారు.