ఆంధ్రప్రదేశ్‌

అవినీతి వల్లే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 30: పోలవరం ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి జరిగిందని కేంద్రం నిర్ధారణకు వచ్చినందువల్లే పోలవరం పనులకు నిధులు ఇవ్వలేమని, పనులు నిలిపివేయమని ఆదేశించిందని వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. స్థానిక వైసీపీ కార్యాయంలో గురువారం విలేఖరులతో మాట్లాడుతూ పోలవరం పనులు నిలిపివేయాలని కేంద్రం లేఖ రాసిందంటే, ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలకు పాల్పడడం వల్లనే కేంద్రం ఆయనకు సహకరించడం లేదని బొత్స అన్నారు. విభజన చట్టంలో భాగంగా పోలవరం ప్రాజెక్ట్‌కు అప్పటి కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ప్రకటించిందని అన్నారు. జాతీయ హోదా ప్రాజెక్ట్‌ను కేంద్రం నిధులతోనే నిర్మించాల్సి ఉందని బొత్స అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను తామే నిర్మిస్తామని కేంద్రం చెప్పినా, వినకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుందని ఎందుకు భుజానకెత్తుకున్నారని ఆయన ప్రశ్నించారు. తనవారికి కాంట్రాక్ట్ పనులు అప్పగించేందుకే చంద్రబాబు ఈ ప్రాజెక్ట్‌ను తీసుకున్నారని ఆయన విమర్శించారు. ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతను తనే ఎందుకు తీసుకోవలసి వచ్చిందో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అని చెబుతున్న చంద్రబాబు తన స్వప్రయోజనాలకోసం ప్రాజెక్ట్‌కు నష్టం తెస్తున్నారని బొత్స విమర్శించారు. పోలవరానికి అనుమతులు తెచ్చి, భూమి పూజ చేసింది రాజశేఖరరెడ్డి అన్న విషయాన్ని తెలుగు ప్రజలందరికీ తెలిసిందేనని బొత్స చెప్పారు. హైదరాబాద్‌కు మెట్రో రైలు తానే తెచ్చానని చంద్రబాబు చెప్పడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు? రైల్వే జోన్ ఏమైంది? ప్రత్యేక హోదాపై తన వైఖరి ఏంటో చంద్రబాబు ప్రజలకు తెలియచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని ఆర్థిక మంత్రి యనమల చెబుతుంటే, చంద్రబాబు మాత్రం దుబారా ఖర్చులు చేస్తున్నారని బొత్స విమర్శించారు. ఈ విషయాలను తాము ప్రశ్నిస్తే, టీడీపీ నేతలు తమపై ధ్వజమెత్తుతున్నారని అన్నారు. సీఎం చర్యలు రాష్ట్రానికి నష్టం కలిగించేవిగా ఉన్నాయని బొత్స అన్నారు. ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్ట్‌తోపాటు, విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి రావల్సిన వాటిని రాబట్టుకోవడానికి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని బొత్స డిమాండ్ చేశారు.