ఆంధ్రప్రదేశ్‌

ప్రపంచ జ్ఞాపకశక్తి పోటీలకు గురుకుల ‘జ్యోతి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, డిసెంబర్ 1: చైనాలో ప్రపంచ స్పీడ్ కార్డు ఓపెన్ మెమరీ పోటీలకు ముమ్మిడివరం సాంఘి క సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిని జగడం ప్రేమ జ్యోతి ఎంపికయ్యింది. కాట్రేనికోన మండలానికి చెందిన ప్రేమ జ్యోతి గురుకుల పాఠశాలలో ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. ఆమెలో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలు గుర్తించిన గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు జ్యోతికి వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చారు. దాంతో ఆమె అక్టోబర్ 15న హైదరాబాద్‌లో జరిగిన 8వ నేషనల్ ఓపెన్ మెమరీ ఛాంపియన్ షిప్ 2017 పోటీల్లో స్పీడ్ కార్డు విభాగంలో బంగారు పతకం సాధించి చైనాలో జరిగే ప్రపంచ మెమరీ పోటీలకు ఎంపికైంది. జ్యోతి చైనా వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వీసాతోపాటు, విమాన టిక్కెట్లను శుక్రవారం అమరావతిలో అందించింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు, ఎక్సైజ్ శాఖా మంత్రి కెఎస్ జవహర్ వీటిని అందించారని ముమ్మిడివరం గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ పి సుజాత శుక్రవారం తెలిపారు.