ఆంధ్రప్రదేశ్‌

పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 1: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్షిణ కొరియాలో డిసెంబర్ 3 నుంచి ఆరు వరకు పర్యటిస్తారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ పెట్టుబడుల ఆకర్షణే ప్రధానాంశంగా ముఖ్యమంత్రి సియోల్, బూసన్ నగరాలలో పర్యటిస్తారన్నారు. కియా మోటార్స్ హెడ్‌క్వార్టర్స్ సందర్శించి, బిజినెస్ సెమినార్‌లో పాల్గొంటారని, కృష్ణపట్నం పోర్టుతో భాగస్వామ్యానికి సంబంధించిన మరో బిజినెస్ సెమినార్‌లో ముఖ్య మంత్రి పాల్గొంటారని తెలిపారు.
బూసన్ సిటీలోని పూసన్ న్యూపోర్టు కంపెనీ, మేకిన్ ఇండియా సెంటర్, నాక్‌శాన్ నేషనల్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, మయోంగ్జీ ఫ్రీ ఎకనామిక్ జోన్ సందర్శిస్తారన్నారు. కొరియా కార్ల దిగ్గజం ‘కియా’, దాని అనుబంధ సంస్థలు మొత్తం కలిపి రూ.13,500 కోట్ల పెట్టుబడులతో అనంతపురం జిల్లాలో అల్ట్రా మెగా ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నాయని, ఈ స్ఫూర్తితో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి ఈ యాత్ర తలపెట్టారని వివరించారు. డిసెంబర్ 4న ఎస్సెట్జ్ గ్రూపుతో ఏపీఈడీబీ అనంతపురంలో ఏర్పాటు చేయనున్న వరల్డ్ క్లాస్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటుకు సంబంధించి ఎంవోయూ కుదుర్చుకోబోతున్నాయని, ఇండస్ట్రియల్ పార్క్, లాజిస్టిక్ పార్క్, వేర్ హౌసింగ్, కమర్షియల్ స్పేస్, హౌసింగ్, గోల్ఫ్ కోర్స్ ఇందులో భాగంగా ఉంటాయన్నారు. ఇందులో 29 కంపెనీలు భాగస్వామ్యం అవుతాయని, మరో 10 కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. కియా మోటార్స్‌కు సంబంధించి 17 అనుబంధ సంస్థలతో ఏపీఐఐసీ, ఈడీబీ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. ఈ సంస్థల ప్రతినిధులు డిసెంబర్ 4న ముఖ్యమంత్రితో భేటీ అవుతారు. డిసెంబర్ 5న బూసన్, ఏపీఐఐసీ మధ్య ఎంఓయూ జరిగే అవకాశం ఉందన్నారు.
డిసెంబర్ 5,6 తేదీలలో రెండు రోడ్ షోలలో ముఖ్యమంత్రి పాల్గొంటారని, డిసెంబర్ 5న బూసన్ సిటీలో కొరియా భారత రాయబారి కార్యాలయం, ఏపీ ప్రభుత్వంతో కలిసి బిజినెస్ సెమినార్ నిర్వహిస్తారు. డిసెంబర్ 6న కియా మోటార్స్‌తో కలిసి మరో బిజినెస్ సెమినార్ జరుగుతుందని తెలిపారు. ఈ పర్యటనలోనే కియా మోటార్స్ హెడ్ క్వార్టర్స్ సందర్శించి వైస్ ఛైర్మన్ లీతో భేటీ అవుతారని తెలిపారు. ముఖ్యమంత్రి బృందంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, వాణిజ్యం, పరిశ్రమలు, ఆహార శుద్ధి శాఖల మంత్రి అమరనాథరెడ్డి, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ అరోకియా రాజ్, ఈడీబీ సీఈవో జాస్టి కృష్ణకిశోర్, ఏపీఐఐసీ ఎండీ అహ్మద్ బాబు పాల్గొంటారన్నారు. దక్షిణ కొరియాకు చెందిన చిన్నకార్ల జెయింట్ ‘కియా’ అనంతపురంలో ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. దానికి అనుబంధంగా మరో 39 అనుబంధ సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. అదే బాటలోనే దక్షిణ కొరియా నుంచి మరికొన్ని సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఈమధ్యనే దక్షిణ కొరియా కాన్సుల్ జనరల్ జియోంగ్ డ్యూయెక్ మిన్ నేతృత్వంలో ఏపీలో పారిశ్రామిక వేత్తల బృందం ఒకటి ఏపీలో పర్యటించింది. ఏయే రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయో సమగ్రంగా అధ్యయనం చేసింది. ఈ రాష్ట్రంలో భూముల లభ్యత, రాయితీలు, సహకారం, అనుమతులిచ్చే విధానం తదితర అన్ని అంశాలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని ఈ బృందం సంతృప్తి చెంది వెళ్లిందన్నారు.
ఎలక్ట్రిక్ స్టీల్, లాజిస్టిక్, నిర్మాణ రంగం, ఫైనాన్స్, ఆటోమొబైల్ కాంపోనెంట్స్, హెవీ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ కాంపొనెంట్స్, బ్యాటరీ, మీట్ ప్రాసెసింగ్, లిక్కర్స్, షిప్ బిల్డింగ్, మెడికల్, మెరైన్ అక్విప్‌మెంట్ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఏపీలో ఓడరేవుల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి అంశాలలో మనం కొరియా సహకారాన్ని కోరుతున్నామన్నారు.