ఆంధ్రప్రదేశ్‌

ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేశాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), డిసెంబర్ 1: ఆడపిల్ల పుట్టిందని భార్య, పాపను వదిలేశాడో భర్త! ఆమెరికా వెళ్లిపోయిన భర్తను ఇక్కడకు తీసుకుని వచ్చి న్యాయం చేయాల్సిందిగా ఆ ఇల్లాలు బోరుమంది. అనకాపల్లి జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న షేక్ సుభాని, తన కుమార్తె షేక్‌ఫాతిమాను జివిఎంసిలో రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న ఎండి రషీదాబేగం కుమారుడైన జబూయిల్ హక్ నవాజ్‌తో పెద్దల సమక్షంలో వివాహం చేశారు. నవాజ్ ఇల్లు హునుమంతవాక సమీపంలోని విశాలాక్షినగర్‌లో ఉండగా, తల్లి, సోదరితో కలిసి ఉంటున్నారు. ఏడు నెల ల గర్భం తర్వాత ఫాతిమాను కన్నవారింటికి పంపించగా ఆమెకు పం డంటి పాప జన్మించింది. అడపిల్ల పుట్టిందని తెలిసిన దగ్గర నుండి అత్తంటివారు ఆమెను ఇంటికి రానివ్వలేదు. విదేశాలలో పనిచేస్తున్న నవాజ్ ఆడపిల్ల పుట్టిందని తెలిసి ఇక స్వదేశం రావడం మానేశాడు. ఏ విధంగానైన పాతిమాను వదిలించుకోనేందుకు భర్త, అత్తింటివారు సిద్ధమయ్యారు. కన్నవారింట్లో ఉంటు న్న ఫాతిమా భర్త, అత్త, ఆడపడుచు, ఆమె భర్తపై అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మహిళా చేతన కార్యదర్శి కె.పద్మ సహాయంతో శుక్రవారం ఉదయం విశాలాక్షినగర్‌లోని అత్తింటికి చేరుకుని, భర్త నవాజ్‌ను ఇక్కడకు తీసుకుని వచ్చి న్యాయం చేయాల్సిందిగా ధర్నా చేశారు. అయితే, దీనిపై ఇప్పటికే కేసు నమోదు అయిందని, భర్తను ఆమెరికా నుండి ఇక్కడకు రప్పించి, అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులంటున్నారు. సాయంత్రం వరకు ధర్నా చేసిన ఫాతిమా తిరిగి పాపతో పాటు కన్నవారింటికి వెళ్ళిపోయింది.