ఆంధ్రప్రదేశ్‌

రైతులకు అండగా ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని/తుగ్గలి, డిసెంబర్ 2: రైతులు అధైర్యపడవద్దని, వారి కి అండగా ఉంటానని వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజా సంకల్పయాత్ర 24వ రోజు కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో కొనసాగింది. తుగ్గలి పలువురు రైతులు జగన్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. రైతులు అధైర్యపడి ఆత్మహత్య చేసుకోవద్దన్నారు. రుణమాఫీ పేర రైతులు, మహిళలను బాబు మోసం చేశారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సీఎం నెరవేర్చలేద్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని, పొదు పు సంఘాల రుణాలు తామే చెల్లిస్తామన్నారు. దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి తనకు ఆదర్శమని, ఆయన పేదల కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. ఆ దివంగత నేత అడుగుజాడల్ల నడిచి రాజన్న రాజ్యం తీసుకువస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అధికారం కట్టబెట్టాలని ప్రజలను జగన్ కోరారు.
24వ రోజు పాదయాత్ర
ప్రజా సంకల్పయాత్ర 24వ రోజు శనివారం పత్తికొండ మండలం నుంచి ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి పత్తికొండ శివారులో బసచేసిన జగన్ శనివారం ఉదయం తిరిగి నడక ప్రారంభించారు. అక్కడి నుంచి తుగ్గలి మండలంలోకి పాదయాత్ర ప్రవేశించింది. రాతన గ్రామం వద్ద మండల నేతలు జగన్‌కు ఘన స్వాగతం పలికారు. తుగ్గలిలో రైతులు, మహిళలు జగన్‌ను కలిసి తమ సమస్యలు ఏకరువు పెట్టారు. మిలాద్ ఉన్ నబి సందర్భంగా ముస్లింలతో కలిసి జగన్ ప్రత్యే క ప్రార్థనలు జరిపారు.
మధ్యాహ్న భోజనం అనంతరం పాదయాత్ర ప్రారంభించిన జగన్ రాత్రికి గిరిగెట్లలో విశ్రాంతి తీసుకున్నారు. యాత్రలో ఎమ్మెల్యేలు, జయరామ్, రాజారెడ్డి, విశే్వశ్వరరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి నాయకులు ప్రహ్లాదరెడ్డి, జగన్నాథరెడ్డి, రామచంద్రరెడ్డి, రాతన మోహన్‌రెడ్డి, శ్రీదేవి పాల్గొన్నారు.

చిత్రం..తుగ్గలి మండలంలో పాదయాత్ర నిర్వహిస్తున్న జగన్