ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీ నిరవధిక వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 2: రాష్ట్ర శాసన సభ, శాసన మండలి 29వ సమావేశాలు శనివారం ముగియడంతో నిరవధికంగా వాయిదా పడ్డాయి. గత నెల 10న ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు జరిగాయి. తొలుత నవంబర్ 25వ తేదీ వరకూ నిర్వహించేందుకు నిర్ణయించినప్పటికీ, వివిధ బిల్లులు సభలో ప్రవేశపెట్టాల్సి ఉండటం, సెలవులు ఎక్కువగా ఉండటంతో డిసెంబర్ 2వ తేదీ వరకూ పొడిగించారు. సమావేశాల మధ్యలో సభ్యులను పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి, విశాఖలో జరిగిన అగ్రిటెక్ సదస్సుకు తీసుకువెళ్లారు. ప్రతిపక్ష సభ్యులు ఈ సమావేశాలను బహిష్కరించినప్పటికీ, స్వపక్షం, మిత్రపక్షాలు ఆ పాత్రను కొంతమేరకు పోషించాయి. కాపు రిజర్వేషన్ సహా కీలకమైన 12 బిల్లులను ఆమోదించారు.