ఆంధ్రప్రదేశ్‌

జస్టిస్ మంజునాథ జాప్యం చేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 2: కాపు రిజర్వేషన్లకు సంబంధించి నివేదిక అందచేయడంలో బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ జాప్యం చేస్తున్నారన్న అభిప్రాయాన్ని మంత్రి నారాయణ వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ నలుగురు సభ్యుల్లో ఇప్పటి వరకూ ముగ్గురు సభ్యులు మాత్రమే నివేదిక ఇచ్చారన్నారు. దీంతో మెజార్జీ సభ్యుల అభిప్రాయంతో ముందుకు వెళ్లామని తెలిపారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు 50 శాతం దాటితే, 9 వ షెడ్యూల్‌లో చేర్చాల్సి ఉంటుందని, అందుకే తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. దీని వల్ల భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు ఉండవని తాము భావిస్తున్నట్లు తెలిపారు.