ఆంధ్రప్రదేశ్‌

కాపుల చిరకాల వాంఛ నెరవేరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 2: కాపులను బీసీల్లో చేర్చాలని మంత్రి మండలి తీర్మానించటం, దానిని ఉభయ సభల్లో ఆమోదించడంతో కాపుల చిరకాల కోరి తీరిందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశల ముగింపు అనంతరం శాసనసభ ప్రాంగణంలోని మీడియఅ పాయింట్ వద్ద శనివారం సాయంత్రం పలువురు కాపు నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీఠాపురంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ కమిషన్ ఏర్పాటు చేయడంతోపాటు నివేదిక తెప్పించుకుని మంత్రి మండలి, ఉభయ సభల్లో ఆమోదింపజేశారని కృతజ్ఞతలు తెలిపారు. దీంతో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు మేలు జరుగుతుందన్నారు. మంజునాథ కమిషన్‌లోని మెజార్టీ ముగ్గురు సభ్యులు నివేదిక ఇచ్చినట్లు పేర్కొన్నారు. బీసీలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రిజర్వేషన్ కల్పించనున్నట్లు చెప్పారు. దీనిని 9వ షెడ్యూల్‌లో చేర్చడానికి ముఖ్యమంత్రి, బీజేపీ నాయకులు ప్రయత్నిస్తారని వెల్లడించారు. మంత్రి మండలిలో బీజేపీ మంత్రులు కూడా ఉన్నట్లు చినరాజప్ప గుర్తు చేశారు.