ఆంధ్రప్రదేశ్‌

కేంద్రాన్ని ఇరికించేందుకే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), డిసెంబర్ 2: రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు బీసీ ఎఫ్ కేటగిరి పేరుతో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామంటూ చంద్రబాబు మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు సిద్దపడ్డారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. శాస్ర్తియత లేని బిల్లు ఆమోదం ఎప్పుడూ పొందలేదని, తద్వారా కోర్టులలో ఈ అంశం నిలబడదన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాపులను ఆకట్టుకునేందుకు బీసీల్లో చేరుస్తామని చెప్పి, అధికారంలోనికి వచ్చిన తరువాత దాన్ని పక్కనపెట్టారని, అందరూ దీనిపై ప్రశ్నించి ఉద్యమాలు చేయడంతో మంజునాథ కమిషన్ అంటూ హడావుడి చేశారన్నారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు అవినీతి ప్రశ్నికు వస్తుంటే, బిసి రిజరేషన్ల అంశాన్ని చంద్రబాబు తెరపైకి తీసుకు వచ్చినట్లు తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటు తనం ఉన్న కులాలను రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఎవరూ అడ్డు చెప్పరని అయితే కాపుల అంశంలో శాస్ర్తియత లేకుండా కేంద్రంపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయం లాభం కోసమే బిల్లును తీసుకు వచ్చినట్లు తెలిపిన ఆయన బిల్లును కేంద్రానికి పంపడం ద్వారా బాబు తనపై ఉన్న బాధ్యతను ప్రధాని నరేంద్ర మోదీపై నెట్టే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోందన్నారు. ఏదైనా కులం వెనుకబాటు తనంపై శాస్ర్తియ నివేదికలు, క్షేత్రస్థాయి పరిశీలనలు ఉంటే ఏభైశాతం దాటినా రిజర్వేషన్లు ఇవ్వచ్చని ఇందిరా సహాని కేసులో సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే పూర్తి స్థాయిలో మంజునాథ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలన్నారు.