ఆంధ్రప్రదేశ్‌

తప్పులో కాలేసిన వైసీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 2: పనె్నండురోజుల పాటు జరిగిన శాసనసభా సమావేశాలను బహిష్కరించడం ద్వారా వైసీపీ నాయకత్వం తప్పులోకాలేసింది. శనివారంతో ముగిసిన సమావేశాల్లో కీలకమైన అంశాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వాన్ని నిలబెట్టి, నిలదీసే అవకాశాన్ని తమ నాయకత్వం చేతులారా పోగొట్టుకుందన్న ఆవేదన వైసీపీ ఎమ్మెల్యేలలో వ్యక్తమవుతోంది. చివరకు తాము వేసిన ప్రశ్నలపైనే అధికార పార్టీ సభ్యులు మంత్రులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారని, అదే తాము హాజరయి ఉంటే మరిన్ని ప్రశ్నలు సంధించి ప్రభుత్వాన్ని ఇరికించేవాళ్లమని వాపోతున్నారు. సభను బహిష్కరించడం ద్వారా తాము సాధించిందేమీ లేకపోగా, ప్రభుత్వం సాధించిన విజయాలే ప్రజల్లోకి ఎక్కువగా వెళ్లాయని, దాన్ని అడ్డుకునే అవకాశం నాయకత్వం దూరం చేసుకుందన్న వ్యాఖ్యలు వైసీపీ ఎమ్మెల్యేలలో వినిపిస్తున్నాయి. తాము రోజూ సభ బయట మాట్లాడుతున్న కీలక సమస్యలను సభలో ప్రస్తావించి, వాటిపై సర్కారు వైఫల్యాలను నిలదీసి ఉంటే ప్రజలు మెచ్చేవారన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. అత్యంత కీలకమైన నిరుద్యోగ భృతి, అమరావతి నిర్మాణం, గృహ నిర్మాణాలు, కాపులకు బీసీ రిజర్వేషన్, పోలవరం, పరిశ్రమలు, వ్యవసాయం వంటి అంశాలపై తాము చేసిన హోంవర్క్ అంతా నాయకత్వ నిర్ణయంతో వృధా అయిందని వాపోతున్నారు. వీటిలో అమరావతి నిర్మాణం, పోలవరం, నిరుద్యోగ భృతి అంశాలపై బయట రోజూ ప్రభుత్వాన్ని ఆరోపణలతో ముంచెత్తామని, అదే సభకు హాజరై ఉంటే ప్రభుత్వం నుంచి మరిన్ని వివరణలు సాధించే వారమని చెబుతున్నారు. అమరావతి, పోలవరం నిర్మాణాలపై తాము సభలో లేకపోవడంతో ప్రభుత్వం చెప్పిందే ఏకపక్షంగా జనంలోకి వెళ్లిందని, అదే తాము సభలో ఉంటే ఆ రెండు అంశాలపై ప్రభుత్వం అంత సులభంగా వ్యవహరించి బయటపడేది కాదంటున్నారు. ‘ప్రధానంగా పోలవరంపై ప్రభుత్వ మోసానికి సంబంధించిన డాక్యుమెంట్లనీ తీసుకుని ఉంచుకున్నాం. కానీ, దానిని సభలో నిలదీసే అవకాశం లేకుండా పోయింద’ని ఓ ఎమ్మెల్యే వాపోయారు. ఒక అంశానికి సంబంధించిన చర్చలో పాల్గొని ఉంటే, వాటిపై వేసే అనుబంధ ప్రశ్నలకు ప్రభుత్వం తప్పనిసరిగా మరిన్ని వివరణలు, గణాంకాలు ఇవ్వాల్సి వచ్చేదని, అది తమకు భవిష్యత్తులో సర్కారుపై దాడి చేసేందుకు ఉపయోగపడేదని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కనీసం విధానమండలి సభ్యులనయినా అనుమతించి ఉంటే బాగుండేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
అసెంబ్లీ కంటే మండలిలోనే చర్చలు బాగా జరుగుతున్నాయని, పైగా అక్కడ వామపక్షాలు, బీజేపీ సభ్యులు కూడా ప్రతిపక్షపాత్ర పోషిస్తున్నందున తమ పార్టీ సభ్యులు ఉంటే దానికి మరింత బలం చేకూరేదని వివరిస్తున్నారు. సభలో మాట్లాడే అవకాశం రాకపోవడం వల్ల, వేరే సాకుతో సభను బహిష్కరించడం మంచి విధానం కాదని మెజారిటీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. సభకు హాజరయి అవకాశం కోసం పోరాడాలే తప్ప, ఇలా పారిపోయారన్న విమర్శకు గురికావడం మంచిది కాదంటున్నారు. ‘వచ్చే ఏడాదిలో కూడా కచ్చితంగా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. అప్పుడు బడ్జెట్ సమావేశాలను కూడా బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంటారా? మా బాసుకు ఎవరు సలహాలిస్తున్నారో తెలియదు. ఇలా అయితే ఇక ఎమ్మెల్యేలుగా ఉండటం వృధా’అని మరో ఎమ్మెల్యే వాపోయారు.