ఆంధ్రప్రదేశ్‌

అవకాశవాద రాజకీయాలు పెరిగిపోయాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 2: అవకాశవాద రాజకీయాలు పెరిగిపోయాయని, కాపులకు రిజర్వేషన్ వంటి అంశాలపై అన్ని పార్టీలు ఆత్మ విమర్శ చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్ర శాసన మండలిలో కాపులకు రిజర్వేషన్ బిల్లును మంత్రి అచ్నెన్నాయుడు శనివారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కాపు రిజర్వేషన్‌పై రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో శ్రీకాకుళం ఈ సమస్యపై ప్రకటన చేశానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు చట్టాన్ని తీసుకువచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. మొక్కుబడిగా చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. శాస్ర్తియంగా చేశామన్నారు. బీసీల రిజర్వేషన్‌లకు అవరోధం కాదని, ఇది అదనమన్నారు. రాజకీయ రిజర్వేషన్లు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీలు 49 శాతం ఉండగా, 25 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని, 11.65 శాతం ఉన్న కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని వివరించారు. రాజకీయం చేయకుండా అందరూ సహకరించాలని, షెడ్యూల్ 9లో చేరిస్తే, కాపులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఎన్నికల హామీని నిలబెట్టుకున్నామన్నారు. అసెంబ్లీ కన్నా మండలి ప్రశాంతంగా ఉందని, ఇక్కడే ఉండాలనిపిస్తోందన్నారు. కాపులకు రిజర్వేషన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కాపుల సమస్య శాశ్వత పరిష్కారానికి మార్గం సుగమమైందన్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పించడానికి వ్యతిరేకమా? అనుకూలమా? అన్న అంశాన్ని వైకాపా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీది రెండు నాలుకల ధోరణి అన్నారు. తెలంగాణలో 17 కులాలను బీసీల జాబితానుంచి తొలగిస్తే మాట్లాడని వారు, ఇక్కడ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓసీ కాపులకు మాత్రమే ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని వివరణ ఇచ్చారు. అగ్రవర్ణాల్లోని పేదవారికి కూడా రిజర్వేషన్ కల్పించే అంశం పరిశీలించాలని సభ్యుడు సూర్యారావు కోరారు. రాజకీయ రిజర్వేషన్ వర్తించదని బిల్లులో పెట్టాలని సభ్యురాలు సునీత సూచించారు. తూర్పు కాపులు, ఓసీ కాపుల్లో ఎవరికి ఇది వర్తిస్తుందో స్పష్టత ఇవ్వాలని సభ్యుడు గాదే శ్రీనివాసులునాయుడు కోరారు. సభ్యుడు పివి మాధవ్ మాట్లాడుతూ కమిషన్ చైర్మన్ నివేదిక రాలేదని, ప్రైవేట్ సంస్థల్లోనూ రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. సభ్యుడు బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదని, ప్రభుత్వ రంగంలో నియామకాలు లేవన్నారు. సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్, ఆదిరెడ్డి అప్పారావు, అంగర రామ్మోహనరావు, కత్తి నర్సింహారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి బిల్లును బలపరిచారు. వాల్మీకి, బోయ కులస్తులను ఎస్టీల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రవేశపెట్టారు. మండలి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.