ఆంధ్రప్రదేశ్‌

డిప్యూటీ కలెక్టర్‌గా కిడాంబి శ్రీకాంత్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 2: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌ను డిప్యూటీ కలెక్టర్‌గా నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ సర్వీసుల్లో ఎపీపీఎస్సీ, సెలక్షన్ కమిటీ, ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ద్వారా మాత్రమే నియామకాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ (రెగ్యులైజేషన్ ఆఫ్ అప్పాయింట్‌మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్ట్ఫా పాట్రన్ అండ్ పే స్ట్రక్చర్) చట్టం- 1994 నిర్దేశిస్తుంది. దీని వల్ల క్రీడాకారులను డిప్యూటీ కలెక్టర్ వంటి పోస్టుల్లో నియమించడం సాధ్యం కాదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆ చట్టానికి సవరణ చేస్తూ, ఒక బిల్లును రాష్ట్ర శాసన మండలిలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు శనివారం ప్రవేశపెట్టారు. ఇన్ని బిల్లులను ఒకేసారి ప్రవేశపెట్టడంపై కొంతమంది సభ్యులు అసహనం వ్యక్తం చేయగా, కొన్ని బిల్లులపై చర్చ అవసరం లేదని, ఈ బిల్లు అటువంటిదేనని తెలిపారు. ఇండోనేషియన్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పొటీల్లో గెలుపొందారు. ఒక సంవత్సరంలో నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లను సాధించిన తొలి భారతీయుడని, ప్రపంచంలో నాలుగో క్రీడాకారుడని మంత్రి తెలిపారు.