ఆంధ్రప్రదేశ్
దక్షిణ కోస్తాకు వాయుగుండం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 3 December 2017
విశాఖపట్నం, డిసెంబర్ 2: దక్షిణ కోస్తాకు వాయుగుండం పొంచి ఉంది. రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ శనివారం పేర్కొంది. ప్రస్తుతం దక్షిణ అండమాన్లో ఉన్న తీవ్ర అల్పపీడనం మరో రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. ఇది క్రమంగా దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు వైపు కదులుతోందని పేర్కొన్నారు. వచ్చే రెండు రోజుల అనంతరం వాయుగుండం మరింత బలపడే అవకాశంపై స్పష్టత లేదన్నారు. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో వచ్చే రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.