ఆంధ్రప్రదేశ్‌

కాపులకు అరచేతిలో వైకుంఠం: తులసిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 3: రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారికి బీసీ(ఎఫ్) కింద 5 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు, అది అమలుకానున్నట్లు చంద్రబాబు భ్రమలు కల్పించడం, ఆ కులాలకు చెందిన కొందరు చెక్క్భజన చేయడం హాస్యాస్పదంగా ఉందని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు. ఇది అరచేతిలో వైకుంఠం చూపించడం మినహా మరేమీ కాదన్నారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు. మన రాష్ట్రంలో ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, రిజర్వేషన్లు 50 శాతం మించితే సుప్రీం కోర్టు కొట్టివేస్తుందన్నారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూలులో చేర్చి పార్లమెంట్ చట్టం చేసినా సుప్రీం కోర్టు ధర్మాసనం సమీక్ష జరుపుతుందని, దీన్నిబట్టి చూస్తే చంద్రబాబు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారికి అరచేతిలో వైకుంఠం చూపినట్లు భ్రమింపజేస్తున్నారని తులసిరెడ్డి ధ్వజమెత్తారు.