ఆంధ్రప్రదేశ్‌

విద్యాశాఖలో పదోన్నతులు ఎన్నడో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 3: రాష్ట్ర విద్యాశాఖలో దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న వివిధ కేడర్ల పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని ఆదివారం నాడిక్కడ గాంధీ మున్సిపల్ హైస్కూల్‌లో జరిగిన ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి ‘జాక్టో’ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సర్వీస్ రూల్స్ విషయంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల హైకోర్టు స్టేటస్‌కో విధించిందని, దీనివల్ల ఉపాధ్యాయులు నష్టపోతున్నందున అడ్‌హాక్ పద్ధతిలో పదోన్నతులు చేపట్టాలని నాయకులు కోరారు. సీపీఎస్ విధానాన్ని రద్దుపరచి ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ జీవోలను అమలు పరచాలని, ఉర్దూ, లాంగ్వేజ్ పండిట్ వ్యవస్థను రద్దుచేసి అన్నీ ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా ఉన్నతీకరణ చేపట్టాలని, పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ బకాయిలతో పాటు కరవు భత్యాలు మంజూరు చేయాలని, నూతన పీఆర్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ జీవో-2 ప్రకారం భర్తీ చేయాలని, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు ఆబ్జెక్టివ్ తరహాలో కాకుండా పాత పద్ధతిలోనే నిర్వహించాలని, ఖాళీగా ఉన్న జిల్లా విద్యాశాఖాధికారి పోస్టులను తక్షణం భర్తీ చేయాలని, రూ.398ల వేతనంతో పనిచేసిన కాలానికి ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, కోరింది. వారికి నెలనెలా రెగ్యులర్ జీతాలు చెల్లించాలని, ఎయిడెడ్ టీచర్లకు హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని, బడ్జెట్ కంట్రోల్‌తో నిమిత్తం లేకుండా జీతాలను 010 పద్దు ద్వారా చెల్లించాలని, వొకేషనల్ టీచర్లకు గతంలో పనిచేసిన సర్వీస్‌ను పెన్షన్‌గా పరిగణించాలని జాక్టో సమావేశం కోరింది.