ఆంధ్రప్రదేశ్‌

ఆ తీర్మానం చెల్లదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 3: కాపులకు 5 శాతం బీసీ రిజర్వేషన్ వర్తింపచేస్తూ శాసనసభ, మండలిలో చేసిన తీర్మానాలు చెల్లవని ఏబీ బీసీ సంక్షేమ సంఘం నేతలు అన్నారు. ఇందుకు నిర్దేశించిన జస్టిస్ మంజునాథ కమిషన్ చైర్మన్ అధికారికంగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉండగా అలాంటివేమీ లేకుండా ఒకరిద్దరు ప్రతినిధులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎలా తీర్మానం చేస్తారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు ప్రశ్నించారు. ఆదివారం గుంటూరులో బీసీ యువజన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా శంకరరావు మాట్లాడుతూ సాంఘిక వెనుకబాటుతనం ఉందని ముగ్గురు సభ్యుల నివేదికలో తేల్చకుండానే, మంత్రి మండలి తీర్మానంలోనూ అలాంటి అర్హత ఉందని చెప్పకుండా చట్టసభల్లో లేనివి ఉన్నట్లు తీర్మానాలు చేయడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని అన్నారు. ముగ్గురు సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలను ప్రామాణికంగా తీసుకుని కమిషన్ చైర్మన్‌ను పక్కనపెట్టి తీసుకునే చర్యలు న్యాయసమ్మతం కాదన్నారు. చైర్మన్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న తరువాతే మెజారిటీ, మైనారిటీ సభ్యులనే ప్రస్తావనకు రావాలన్నారు. కమిషన్ చైర్మన్ నివేదిక పంపడంలో జాప్యం జరిగిందనే కుంటిసాకు సరైంది కాదన్నారు.
ప్రభుత్వం నియమించిన చైర్మన్ అభిప్రాయంతో ప్రమేయం లేకుండా ఆగమేఘాలపై రాజకీయ లబ్ధి కోసం హైడ్రామా నడిపారని ఆయన ఆరోపించారు. జస్టిస్ మంజునాథ కమిషన్ నివేదిక బయటపడితే అసలుకే మోసం వస్తుందనే భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా బీసీలకు అన్యాయం చేశారని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో న్యాయస్థానాల్లో బీసీలం పోరాడతామని స్పష్టం చేశారు.