ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి మోడల్ స్కూళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 7: రాష్ట్రంలోని 163 మోడల్ పాఠశాలలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని వారికి 0/0 పద్దు కింద జీతాల చెల్లింపునకు సంబంధించిన ఫైల్‌ను సిద్ధం చేసి త్వరలో ప్రభుత్వ ఆమోదానికి పంపేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి హామీ ఇచ్చారని మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శివశంకరరెడ్డి, జి.చంద్రశేఖర్ తెలిపారు. గురువారం జరిగిన చర్చల్లో సంధ్యారాణి నుంచి స్పష్టమైన హామీ లభించినందున శుక్రవారం తలపెట్టిన చలో సచివాలయం కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని అన్నారు. పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌లో తేడాలు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం, పాఠశాలల పనివేళల మార్పు, కారుణ్య నియామకాలు, పదోన్నతులు, పీఆర్‌సీ బకాయిలు, బదిలీలు, అదనపు హిందీ టీచర్ల నియామకం, లైబ్రరీ, పీఈటీల వేతనం పెంపు, వంటి సమస్యలపై ప్రభుత్వానికి నివేదిస్తానని సంధ్యారాణి హామీనిచ్చారు.