ఆంధ్రప్రదేశ్‌

ఏపీకి రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 7: దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా పరిశ్రమలశాఖ మంత్రి ఎన్.అమరనాధరెడ్డి, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఆర్.ప్రీతమ్‌రెడ్డి గురువారం సియోల్‌లో హ్యుండాయ్ మోటార్స్ గ్రూపు ఎలక్ట్రిక్ వెహికల్, ఫ్యూచర్ వెహికల్ వైస్ ప్రెసిడెంట్ జంగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి దక్కుతున్న ప్రోత్సాహం, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో అనుకూలమైన వాతావరణం ఉందని, హ్యుండాయ్ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కేంద్రంతో పాటు పరిశోధన, అభివృద్ధి (రీసెర్చ్ అండ్ డెవలప్) కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలని జంగ్‌ను మంత్రి కోరారు. కియా మోటార్స్ కంపెనీ విషయంలో ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ సంతోషకరంగా ఉందని, తాము కూడా ఏపీలో తమ కంపెనీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నామని హ్యుండాయ్ కంపెనీ యాజమాన్యం మంత్రికి తెలిపారు.