ఆంధ్రప్రదేశ్‌

రాజమహేంద్రవరంలో ఏసీబీ కోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), డిసెంబర్ 7: రాష్ట్రంలో అవినీతి నిరోధక (ఏసీబీ) కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలో ఏసీబీ నూతన కార్యాలయ భవనాన్ని గురువారం ప్రారంభించిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాజమండ్రి కేంద్రంగా ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. అవినీతి అధికారులు పట్టుబడినప్పటికీ కొద్ది కాలానికే తిరిగి ఉద్యోగంలో చేరుతున్నారని, ఇటువంటి సందర్భాల్లో తిరిగి అవినీతి చోటుచేసుకుంటోందన్న విమర్శలపై ఆయన స్పందించారు. ఏసీబీలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఆన్‌లైన్ ఫిర్యాదుల స్వీకరణ అమలు చేస్తామన్నారు. దీనివల్ల అవినీతికి పాల్పడే అధికారిపై వచ్చే ఫిర్యాదులు నేరుగా ఉన్నతాధికారులకే చేరుతాయన్నారు. ఫిర్యాదిదారుల వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి పి. అశోక్ గజపతిరాజు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, డీజీపీ ఎన్.సాంబశివరావు, ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.