ఆంధ్రప్రదేశ్‌

‘ఫాతిమా’ విద్యార్థులకు న్యాయం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 7: ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థుల సమస్యపై కేంద్ర ప్రభుత్వం ఈ నెల 11న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్థానిక ఎన్‌టిఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో మంత్రి కామినేని గురువారం ఫాతిమా కాలేజీ విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డాతో ఈ విషయంపై మంత్రి కామినేని ఫోన్‌లో మాట్లాడారు. ఫాతిమా కాలేజీ విషయంపై ఆయన వివరించగా ఈ నెల 11న ఢిల్లీలో ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేద్దామని సూచించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సూదన్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఎంసీఐ ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. అనంతరం 14కాలేజీ యాజమాన్యంతో తల్లిదండ్రుల సమక్షంలో సమావేశం నిర్వహిస్తామన్నారు. రాబోయే విద్యా సంవత్సరానికి విద్యార్థులు నీట్ పరీక్ష రాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తుందన్నారు. విద్యార్థులు ఎవరైనా తమకు సీటు వద్దనుకుని ముందుకు వస్తే వారికి ఫాతిమా యాజమాన్యం నుండి తగిన విధంగా న్యాయం చేస్తామన్నారు. ఫాతిమా కాలేజీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున శక్తివంచన లేకుండా విద్యార్థులకు న్యాయం చేయడానికి అన్ని విధాల కృషి చేస్తున్నామన్నారు. ఇదంతా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వివరించినట్లు తెలిపారు. ఫాతిమా కేసుపై సుప్రీంకోర్టులో తీర్పు అనంతరం ముఖ్యమంత్రి ఆదేశాలపై ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డాని కలిసినట్లు తెలిపారు. ఫాతిమా కాలేజీ సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ అధికారులతో పాటు ఎంసీఏ ప్రతినిధులతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి కొన్ని ప్రతిపాదనలు సూచించారు. సమావేశంలో మంత్రితోపాటు ముఖ్యమంత్రి కార్యదర్శి గిరిజా శంకర్, డిఎంఈ సుబ్బారావు, ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏసీ సీవీ రావు, రిజిస్ట్రార్ పాల్గొన్నారు.
రాష్ట్రానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు
గత 8 సంవత్సరాలుగా రాష్ట్రంలో 108 అంబులెన్స్ సేవలను నిర్వహిస్తున్న జీవీకె-ఈఎంఆర్‌ఐ సంస్థ కాలపరిమితి తీరడంతో కొత్తగా టెండర్లను పిలిచామన్నారు. కొత్త టెండర్లు రద్దుచేయాలని ఎన్‌జీవోలు కోర్టుకు వెళ్లారన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్ట తీర్పు ఇచ్చిందన్నారు. త్వరలోనే కొత్త సర్వీస్ ప్రొవైడర్ వస్తారన్నారు. కొత్తగా వచ్చే సంస్థ ప్రత్యేకంగా యాప్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే 108 సిబ్బంది దగ్గరలో ఉన్న ఆసుపత్రికి ముందస్తుగా సమాచారం అందిస్తారన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకువచ్చేలోగా ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమై చికిత్సను అందించడానికి వీలు ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి సరైన వైద్యం అందించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్యేయమని, అందుకు కృషి చేస్తున్నామన్నారు.