ఆంధ్రప్రదేశ్‌

అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారి నిర్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, డిసెంబర్ 8: చిన్నారిని అంగన్‌వాడీ కేంద్రంలో ఉంచి తాళం వేసి వెళ్లిన సంఘటన అనంతపురం జిల్లా ఆత్మకూరులో శుక్రవారం వెలుగుచూసింది. తలుపువద్దకు వచ్చి ఏడుస్తున్న చిన్నారిని గమనించిన స్థానికులు తహసీల్దార్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంటనే అక్కడికి చేరుకుని తాళం పగులగొట్టించి చిన్నారిని బయటకు రప్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూరు ఎస్సీ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రం 7వ సెంటర్‌ను అంగన్‌వాడీ కార్యకర్త ఎంఎం.లక్ష్మీదేవి నిర్వహిస్తోంది. శుక్రవారం పిల్లలు అంగన్‌వాడీకి వచ్చారు. మరుగుదొడ్ల సర్వే పని ఉండడంతో పిల్లలను ఆయా సరస్వతికి అప్పగించి లక్ష్మీదేవి వెళ్లిపోయింది. మధ్యాహ్నం పిల్లలను బయటకు పంపిన సరస్వతి కేంద్రానికి తాళం వేసింది. అయితే కొద్ది సేపటికి లోపలే ఉన్న బాలిక కీర్తన తలుపువద్దకు వచ్చి ఏడ్వసాగింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే తహశీల్దార్ నారాయణకు సమాచారం అందించారు. ఆయన తాళం పగులగొట్టించి చిన్నారిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కేంద్రం లోపల ఉన్నారా లేదా అన్నది చూసుకోకుండా తాళం వేసుకుని వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

చిత్రం..ఆత్మకూరులోని అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారిని ఉంచి తాళం వేసిన దృశ్యం