ఆంధ్రప్రదేశ్‌

‘బ్యాంకింగ్, వైద్యం, గనుల రంగాల్లో సహకరించండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 11: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధులతో సోమవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయం, రవాణా, జల రవాణా, విద్య, గనుల తవ్వకం, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి వివిధ రంగాల్లో తోడ్పాటుకు ఆస్ట్రేలియా - ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటైంది. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పనిచేసేందుకు ముందుకొచ్చి అవగాహన ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో ఈ వర్కింగ్ గ్రూపు సమావేశంలో ఆయా అంశాల వారీగా ప్రాజెక్టులు చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈసందర్భంగా సీఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ రంగాల్లో తోడ్పాటును అందించేందుకు కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ సియాన్ కెల్లే మాట్లాడుతూ ఆస్ట్రేలియా - ఏపీ కోఆపరేషన్ వర్కింగ్ గ్రూప్‌కు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా అన్నివిధాలా మెరుగైన రీతిలో పనిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సమావేశంలో ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధులు సురేష్ గోయల్, జామి ఇవర్ట్, బెర్ట్ కిర్క్, సియాన్ ప్రీమెన్, లిసా మెక్పెర్సన్, థామ్ షౌటర్, హ్రిదేశ్ కోహ్లి, కె శ్రీనివాస్, పీటర్ బాల్డివిన్ పాల్గొన్నారు.