ఆంధ్రప్రదేశ్‌

క్రికెట్ బుకీల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట, డిసెంబర్ 10 : కడప నగరంలో క్రికెట్ పందేలు నిర్వహిస్తున్న స్థావరాలపై ఆదివారం పోలీసులు దాడులు చేసి ముగ్గురు బుకీలను అదుపులోకి తీసుకోవడంతో పెద్దఎత్తున నగదు, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, కడప డీఎస్పీ మాసూంబాషా తెలిపారు. ప్రొద్దుటూరుకు చెందిన షేక్‌మహ్మద్, షేక్ ఫరూక్, ఖురేషీ రిజ్వాన్ కడప నగరంలోని రవీంద్రనగర్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో తాలూకా, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో క్రికెట్ బుకీలను అరెస్టు చేసి వారి నుంచి రూ. 20,70,260 నగదు, 2 కిలోల గంజాయితో పాటు 7 సెల్‌ఫోన్లు, టీవీ, ల్యాప్‌ట్యాప్, ఇన్నోవా వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై గతంలో కూడా ప్రొద్దుటూరు, కడపలో కేసులు నమోదైనట్లు తెలిపారు.