ఆంధ్రప్రదేశ్‌

సీపీఎస్‌ను రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 11: రాష్ట్రంలో లక్షా 80వేల మంది ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికుల పాలిట శాపంలా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సీపీఎస్) రద్దుపరచి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాలకు స్వస్తిచెప్పి రెగ్యులర్ సాంప్రదాయ నియామకాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. శని, ఆదివారాల్లో స్థానిక స్వాతంత్య్ర సమరయోధుల సంఘ భవనంలో జరిగిన ఫెడరేషన్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశంలో చేసిన తీర్మానాల వివరాలను ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాద్ సోమవారం నాడిక్కడ వెల్లడించారు. సీనియర్ నేతలు ఎంఆర్ గోవిందారెడ్డి, వై.్భస్కరరావుల ఆధ్వర్యంలో జరిగిన నూతన కార్యవర్గ ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్.రఘురామిరెడ్డి (అనంతపురం), ప్రధాన కార్యదర్శిగా పి.పాండురంగ వరప్రసాదరావు, ఉపాధ్యక్షులుగా సిహెచ్ మంజుల (ప్రకాశం), ఎ.శ్యాంసుందరరెడ్డి (కడప), వై.సీతాంజనేయులు (గుంటూరు), సీహెచ్ బాలకృష్ణమూర్తి (నెల్లూరు), బిజె మాణిక్యంరాజు (కర్నూలు), కార్యదర్శులుగా బీ.వెంకటపతిరాజు (విశాఖ), ఎస్‌వీ అనిల్‌కుమార్ (శ్రీకాకుళం), ఐ.రాజగోపాల్ (ప.గో), బి.నరసింహులు (అనంతపురం), ఐ.విజయసారధి (ప్రకాశం), డి.సరస్వతి (శ్రీకాకుళం), మరో ఏడుగురు కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు.