ఆంధ్రప్రదేశ్‌

‘బీసీ కమిషన్ సభ్యుల నివేదికకు చట్టబద్ధత లేదు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 11: కాపులను బీసీల్లో చేర్చే అంశం మీద కమిషన్‌లోని ముగ్గురు సభ్యుల విడివిడి ‘నివేదిక’లు ఆయా సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలు అవుతాయే తప్ప అవి బీసీ కమిషన్ నివేదిక అర్హతని పొందజాలవని, వాటికి చట్టబద్ధత లేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు స్పష్టం చేశారు. కమిషన్ చైర్మన్, సభ్యుల అభిప్రాయాలను క్రోడీకరించుకుని ఒక నిర్ణయానికి రావలసి ఉంటుందన్నారు. మైనార్టీ సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను నివేదికలో భిన్నాభిప్రాయం డిసెంట్‌గా పొందుపరచవలసి ఉంటుందన్నారు. చైర్మన్‌తో సహా మొత్తం కమిషన్ సభ్యులు అందరూ కూర్చుని చర్చించకుండానే ముఖ్యమంత్రి తనకు అనుకూలంగా ఉన్న ముగ్గురు సభ్యుల అభిప్రాయాలను తెప్పించుకుని మంత్రివర్గ సమావేశంలో కమిషన్ నివేదికను ఆమోదించినట్లుగా మోసపూరితంగా ప్రకటించారన్నారు. వాస్తవానికి అవి వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప వాటికి కమిషన్ నివేదిక అనే చట్టబద్ధత లేదని సోమవారం ఒక ప్రకటనలో శంకరరావు తెలిపారు.