ఆంధ్రప్రదేశ్‌

కేంద్రానికి లోకేష్ కృతజ్ఞతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 11: రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ మంజూరు చేసినందుకు కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీని మొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగ హబ్‌గా తయారు చేయాలని లక్ష్యంగా పని చేస్తున్నామని వెల్లడించారు. మొబైల్‌కు సంబంధించి బ్యాటరీ నుంచి అన్ని రకాల విడిభాగాలు ఏపీలో తయారయ్యేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలో తయారవుతున్న 10 ఫోన్లలో రెండు రాష్ట్రంలోనే తయారవుతున్నాయని తెలిపారు. 2019 నాటికి ఈ సంఖ్య ఐదుకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతపురంలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.