ఆంధ్రప్రదేశ్‌

హిజ్రాలకూ పింఛను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 11: సమాజంలో ఆదరణకు నోచుకోని హిజ్రాలకు పింఛన్లు ఇచ్చి ఆదుకోవాలని చంద్రబాబునాయుడు యోచిస్తున్నారు. దీనిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. వెలగపూడి సచివాలయంలో సాధికారమిత్రల నియామకంపై సెర్ప్ అధికారులతో సోమవారం ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 44.81 లక్షల మంది పింఛన్ల కోసం నెలకు 450 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 43,869 హిజ్రాలున్నట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దానికి స్పందించిన బాబు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం అన్యాయానికి గురికాకుండా అందరికీ ఆర్ధిక, సామాజిక భద్రత కల్పించాలని సూచించారు. విదేశాల్లోని ప్రవాసాంధ్ర కార్మికులకు బీమా ద్వారా రక్షణ కల్పించాలని కూడా నిర్ణయించారు. 10 లక్షల రూపాయలు పరిహారం అందించే ప్రవాసాంధ్ర బీమా పథకాన్ని జనవరిలో ప్రారంభించాలని అధికారులకు తెలిపారు. ఏపీఎన్నార్టీ సమన్వయంతో ఈ పథకం అమలు కానుందన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి ఒక్క సభ్యురాలి సామర్ధ్యం పెంపు, శిక్షణపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. ఇందుకోసం త్వరలో ప్రత్యేక కార్యక్రమం రూపొందించాలని నిర్దేశించారు. ప్రతి 35 కుటుంబాలు ఒక క్లస్టర్‌గా చేపట్టిన ‘సాధికార మిత్ర’ల నియామకం ఎంతవరకు వచ్చిందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. సేవే లక్ష్యంగా ముందుకొచ్చేవారిని ‘సాధికారమిత్ర’లుగా నియమించాలని, వీరంతా ప్రభుత్వానికి - ప్రజలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరించేలా చూడాలని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 4,70,070 ‘సాధికార మిత్ర’ క్లస్టర్ల ద్వారా 5,86,157 కుటుంబాలకు ప్రయోజనం కలిగించాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. నియోజకవర్గాలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వడం ద్వారా ‘సాధికార మిత్ర’లకు యూనిక్ ఐడీ కేటాయించాలని చెప్పారు. ‘సాధికార మిత్ర’గా ఎంపికైన ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు, ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అన్నారు. ‘స్ర్తినిధి’ ద్వారా రూ.1,200 కోట్లతో చిరు వ్యాపారాలు చేసే 4,90,000 స్వయం సహాయం సంఘాల సభ్యులకు, ‘ఉన్నతి’ పథకం కింద రూ.153.93 కోట్లతో 38,600 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సాయం చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 67,84,602 మంది సభ్యులకు రూ.576.62 కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామని తెలిపారు. ‘పసుపు-కుంకుమ’ పథకం కింద రెండు విడతల్లో 82,85,000 సభ్యులకు ఒక్కొక్కరికి రూ.6వేల చొప్పున రూ.4,971 కోట్లు అందించినట్టు చెప్పారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో 5వేల మెట్రిక్ టన్నుల జీడిపప్పును సేకరించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతోందన్నారు.
చిత్రం..సెర్ప్ అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు