ఆంధ్రప్రదేశ్‌

కాపు రిజర్వేషన్ బిల్లు చట్ట విరుద్ధం: జేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 11: పోరాటాలు.. ఉద్యమాలు కాదు.. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కొన్ని దశాబ్దాలుగా వెంటాడుతూ వస్తున్న సమస్యలను అందరికీ ఆమోదయోగ్యమైన.. ఆర్థిక భారం లేకుండా తేలిగ్గా అమలు చేయగలిగిన సమస్యల పరిష్కారం కోసం అందరం కల్సి ఉద్యమించాలి.. ఆపై మార్పును సాధించాలంటూ లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ పిలుపునిచ్చారు. గత సెప్టెంబర్ 15తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తాను ప్రారంభించిన సురాజ్య యాత్రలో భాగంగా సోమవారం విజయవాడ వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ యాత్ర మూడు రోజులపాటు కృష్ణాజిల్లాలో జరిగిన అనంతరం ముగుస్తుందన్నారు. ఆపై ఈనెల 14తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కల్సి తాను గుర్తించిన అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళతానన్నారు. దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుతం చెలామణి అవుతున్న ఏ రాజకీయ పార్టీ కూడా అసలు పార్టీయే కాదు.. అవన్నీ వ్యాపార పార్టీలు.. ఒక సిద్ధాంతం.. పాడు లేదు. ఏదో విధంగా అధికారంలోకి రావాలన్నదే తపన.. తాపత్రయమన్నారు. శాసనసభలో కాపు రిజర్వేషన్ బిల్లు చట్టవిరుద్ధం.. చట్టబద్దంగా నియామకమైన కమిషన్ పూర్తి నివేదిక లేకుండా ఎలా ఆమోదిస్తారు.. ఇదేమి రాచరిక పాలనా అంటూ జేపీ మండిపడ్డారు. భారతదేశం ప్రస్తుతం అప్పులతో రోజూ సగటున 11వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నది. అయినప్పటికీ కీలకమైన విద్య, వైద్య, ఇతర రంగాలన్నింటిలోనూ ఎంతో వెనుకబడి ఉందన్నారు. ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని పాలకులు భ్రష్టుపట్టిస్తున్నారంటూ జేపీ నిప్పులు చెరిగారు.