ఆంధ్రప్రదేశ్‌

రెవెన్యూశాఖ వీఆర్‌ఏలకు టీఏ, డీఏ పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 11: రాష్ట్రంలో రెవిన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ)గా పనిచేస్తున్న 3వేల మంది సిబ్బందికి టీఏ, డిఏ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో 1307, 1308ను జారీ చేసింది. రూ.20 నుంచి రూ.100ల వరకు టీఏ, రూ.100ల నుంచి రూ.300ల వరకు డీఏ పెరుగనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరించారంటూ సీఎం చంద్రబాబుకు రాష్ట్ర రెవెన్యూ సంఘ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వీఆర్‌ఏల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కైకాల గోపాలరావు ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
కొత్తగా ఏర్పాటైన ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ టీవీ ఫణి పేర్రాజు, తదితరుల సమక్షంలో సోమవారం వివిధ సంఘాల నేతలు సచివాలయంలో సభ్యత్వం తీసుకున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, పంచాయతీరాజ్ సర్వీస్ అసోసియేట్స్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ మినిస్టీరియల్ అసోసియేట్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో సంస్కరణలు తీసుకువస్తున్న నేపధ్యంలో ఏ మార్పు చేసినా ముందుగా పంచాయతీరాజ్ సర్వీస్ అసోసియేషన్‌తో సంప్రదింపులు జరుపాలన్నారు. కార్మికశాఖలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్, జూనియర్, సీనియర్ సహాయకులకు పదోన్నతులు కల్పించాలన్నారు.