ఆంధ్రప్రదేశ్‌

ఖరారు కాని కలెక్టర్ల సదస్సు తేదీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 12: ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహణ తేదీలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. సంక్రాంతి తరువాత నిర్వహించాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ సూచించగా, జనవరిలో నిర్వహించేందుకు సీఎం విముఖత వ్యక్తం చేస్తూ, సదస్సు తేదీలపై ప్రకటనను వాయిదా వేశారు. వెలగపూడిలో విభాగాధిపతులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించేందుకు ఎంత సమయం కావాలని వీడియో కాన్ఫరెన్సులో ఉన్న కలెక్టర్లను ప్రశ్నించారు. దీనిపై సీఎస్ స్పందిస్తూ, జనవరిలో జన్మభూమి ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉందని తెలిపారు. అందవల్ల సంక్రాంతి తరువాత నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. దీనిపై సీఎం స్పందిస్తూ, ఇప్పటి వరకూ 13 జిల్లా కలెక్టర్ల సదస్సులు నిర్వహించానని, తొలి సదస్సు ఆరునెలలకు నిర్వహించామని, ఆ తరువాత ఎప్పుడూ మూడు నెలలు దాటలేదని గుర్తు చేశారు. సదస్సు జనవరికి వాయిదా వేస్తే, అందరూ రిలాక్స్ అవుతారన్నారు. తాను చెప్పిన తేదీకి నిర్వహించడం వల్ల లోపల తిట్టుకున్నా, బయట అనుసరిస్తారన్నారు. ఒక సారి వ్యవస్థ నుంచి జారితే, అది కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. క్రమశిక్షణతో ఉండటం వల్లే దక్షిణ కొరియా వంటి దేశాలు పైకి వెళ్లాయన్నారు. కలెక్టర్లను అడిగినప్పటికీ సదస్సు తేదీల గురించి మాట్లాడకపోవడంతో ఈ సదస్సు తేదీలను ప్రకటించకుండా సమావేశం ముగించారు.
కలలోనూ టాయిలెట్లే వస్తున్నాయి: కడప కలెక్టర్ బాబూరావు
కలెక్టర్ల సదస్సు, జన్మభూమి తేదీల నేపథ్యంలో టాయిలెట్ల లక్ష్యం కూడా పూర్తి చేయాల్సి ఉందని, కలలోనూ తనకు టాయిలెట్లే వస్తున్నాయని కడప జిల్లా కలెక్టర్ టి.బాబూరావు నాయుడు తెలిపారు. సీఎం దీనిపై స్పందిస్తూ, కలలో కూడా అవే రావాలని చమత్కరించారు.