ఆంధ్రప్రదేశ్‌

పోలవరం రేట్లు పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 12: పాత రేట్లకు పని చేయడం కష్టమని, రేట్లు పెంచాలని త్రిసభ్య కమిటీ ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదన ఉంచారు. అయితే ప్రస్తుతం కేంద్రం ఉన్న పరిస్థితుల్లో రేట్లు పెంచడం సాధ్యం కాకపోవచ్చన్న అభిప్రాయాన్ని త్రిసభ్య కమిటీ వ్యక్తం చేసింది. వర్కు కన్సార్టియం ఏర్పాటుకు కూడా త్రిసభ్య కమిటీ అంగీకరించలేదు. దీంతో ఈ వ్యవహారాన్ని కేంద్రంతోనే తేల్చుకునేందుకు సీఎం ఢీల్లీ వెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలపై వెలగపూడి సచివాలయంలో త్రిసభ్య కమిటీతో ముఖ్యమంత్రి మంగళవారం సమావేశమయ్యారు. త్రిసభ్య కమిటీ అంతకుముందు మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుతో సమావేశమై చర్చించింది. అనంతరం సీఎంతో కమిటీ సమావేశమైంది. 2013 నాటి రేట్ల ప్రకారం ప్రాజెక్టు అంచనాలు రూపొందించారని, పాత రేట్లతో ప్రస్తుతం పెరిగిన ధరలతో పనులు చేయడం కష్టమని కమిటీకి సీఎం తెలిపినట్లు సమాచారం. అయితే అప్పట్లో ఈపీసీ విధానంలో టెండర్లు పిలిచారని, అంచనా కంటే ఖర్చు పెరిగినా, తగ్గినా ప్రభుత్వానికి సంబంధం లేదని కమిటీ స్పష్టం చేసినట్లు తెలిసింది. అప్పర్ కాఫర్ డ్యామ్ నిర్మాణం, చిల్లింగ్ ప్లాంట్‌కు అదనపు చెల్లింపుల అంశాన్ని సీఎం ప్రస్తావించినట్లు తెలిసింది. కొత్త సంస్థలతో కలిసి కన్సార్టియంగా ఏర్పడితే ట్రాన్స్‌ట్రాయ్‌కు ఆ పనులు ఇవ్వడానికి అభ్యంతరం లేదని కమిటీకి తెలిపారు. కొత్తగా పిలిచిన టెండర్లను ఆమోదించాలని కోరినట్లు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదనలకు త్రిసభ్య కమిటీ అంగీకరింలేదు. ప్రధానంగా కేంద్రం రేట్ల పెంపును అంగీకరించకపోకవచ్చని కమిటీ స్పష్టం చేయడంతో ఈ విషయాలపై కేంద్రంతోనే తేల్చుకుంటానని సిఎం వ్యాఖ్యానించినట్లు భోగట్టా. కమిటీ సమావేశం తరువాత కేంద్ర మంత్రి గడ్కరీకి ఫోన్ చేసి సీఎం మాట్లాడారు. ఢిల్లీ వస్తే చర్చించుకుందామని చెప్పడంతో బుధవారం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు.