ఆంధ్రప్రదేశ్‌

ఇక ఏటా సూర్య ఆరాధన ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 12: ఇక ఏటా సూర్య ఆరాధన ఉత్సవాలు కూడా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో వివిధ విభాగాధిపతులతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ దేవుడిని వివిధ రూపాల్లో పూజించడం అంటే ప్రకృతిని ఆరాధించడమేమన్నారు. ఇప్పటికే నిర్వహిస్తున్న ప్రతి ఏటా ఏరువాక, జలసిరికి హారతి వంటి ఉత్సవాలతో పాటు ఈ ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తామన్నారు. రాష్ట్రానికి సూర్యోదయ రాష్ట్రంగా పేరు పెట్టుకున్నామని, సూర్యుడిని ఆరాధించడం అంటే సూర్యశక్తిని మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు దృష్టి పెట్టడమేనన్నారు. ఇప్పటికే భారీ ఎత్తున సౌర విద్యుత్‌ను వినియోగించుకుంటున్నామన్నారు. సంస్కృతిని, ప్రకృతిని గౌరవించడం కూడా నేర్చుకోవాలన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెరుగుతుందని, తాత్కాలిక ఇబ్బందులున్నా, చమురు ధరలు తగ్గుతాయన్నది తన నమ్మకమన్నారు.