ఆంధ్రప్రదేశ్‌

మీకు బాధ్యత లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 12: ‘పదవులు తీసుకున్నవాళ్లు పనిచేయకపోతే ఎలా.. నామినేటెడ్ పదవులు ఇచ్చాం. అవి తీసుకున్న వాళ్లు కూడా సరిగా పనిచేయడం లేదు. రాష్ట్రంలో 40 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అక్కడి ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు పనితీరు మార్చుకోవడం లేదు. వాళ్లను త్వరలో పిలిచి మాట్లాడతా. అప్పటికీ మారకపోతే వారి స్థానాల్లో కొత్త నేతలను ప్రకటిస్తా’నని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. మంగళవారం జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో నేతల పనితీరుపై చంద్రబాబునాయుడు పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా మంత్రులకు పార్లమెంటు నియోజకవర్గాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినా వారు వాటిని సక్రమంగా నిర్వర్తించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తన వద్ద ఉన్న నివేదికలు చూస్తూ మంత్రులు అఖిలప్రియ, పరిటాల సునీత పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మీకు పార్లమెంటు బాధ్యతలు అప్పగించినా సరిగా నిర్వర్తించకపోతే ఎలాగమ్మా? మీపై నమ్మకంతోనే కదా అప్పగించింది? అని సున్నితంగా మందలించారు. ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా ఆ బాధ్యతల్లో విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. పయ్యావుల కేశవ్, వర్ల రామయ్య, కొత్తపల్లి సుబ్బారాయుడు వంటి ప్రధాన కార్యదర్శులు బాగా పనిచేశారని, ఇంకా బాగా పనిచేయాలని కితాబిచ్చారు. మంత్రు ల నుంచి నేతల వరకూ చిత్తశుద్ధితో పనిచేయాలని, అవి లక్ష్యాన్ని చేరుకునేలా ఉండాలన్నారు. నియోజకవర్గాల్లో ప్రభుత్వ పనితీరు 80 శాతం సంతృప్తి వచ్చేలా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. ఆస్తుల ప్రకటనపై వస్తున్న విమర్శలకు స్పందించిన బాబు, దేశంలో ఏ రాజకీయ పార్టీ ప్రకటించని విధంగా తాము మాత్రమే ఆస్తుల ప్రకటన చేస్తున్నామని, లోకేష్ రాజకీయాల్లోకి రాకముందు ఆస్తులు ప్రకటించారన్నారు. మిగిలిన వారు కూడా తమను ఆదర్శంగా తీసుకోవలసింది పోయి, తమ మీద బురద చల్లుతున్నారని విమర్శించారు. అగ్రిగోల్డ్, ఫాతిమా కాలేజీ అంశాల్లో సమ స్య పరిష్కారానికి సూచనలివ్వాలన్నారు. ఫాతిమా విషయంలో సమస్య ఉందని, వారికి అన్యాయం జరిగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదన్నారు. చాలా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి మెరుగుపడిందని చంద్రబాబునాయుడు చెప్పారు.