ఆంధ్రప్రదేశ్‌

16మంది డీఎస్పీల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 12: రాష్ట్రంలో 16మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈమేరకు సోమవారం రాత్రి డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా బదిలీ అయిన డీఎస్పీల్లో ఎక్కువ మంది ఇంటిలిజెన్స్‌కు వెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ ఎన్ మురళీకృష్ణ, కడప ట్రాఫిక్ డీఎస్పీ ఎం భక్తవత్సలం, కడప ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ బి శ్రీనివాసులు, కడప సిసిఎస్ డీఎస్పీ జి నాగేశ్వరరెడ్డి, అనంతపురం ట్రాఫిక్ డీఎస్పీ యు నరసింగప్ప, చిత్తూరు మహిళా పిఎస్ డీఎస్పీ ఎం గిరిధర్‌రావులను ఇంటిలిజెన్స్‌కు బదిలీ చేశారు. అదేవిధంగా వెయిటింగ్‌లో ఉన్న కె వేణుగోపాల్ ఒంగోలు ట్రాఫిక్ డీఎస్పీగా బదిలీ అయ్యారు. , ఇంటిలిజెన్స్‌లో ఉన్న కె రంగన్‌గౌడ్‌ను పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. ఇంటిలిజెన్స్‌లో ఉన్న ఎం రామకృష్ణయ్య, ఎం రమేష్‌రెడ్డి, కె భార్గవరావు నాయుడులను హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. గ్రౌహౌండ్స్‌లో వెయిటింగ్‌లో ఉన్న ఎం శ్రీనివాసరావును, చిత్తూరు స్పెషల్ బ్రాంచికి, ఇక్కడ పని చేస్తున్న ఎన్‌టివి రామ్‌కుమార్‌ను తిరుమల స్పెషల్ బ్రాంచికి, ప్రకాశం జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ పి శ్రీ్ధర్‌ను నెల్లూరు మహిళా పీఎస్‌కు, రాజమండ్రి ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ పి సోమశేఖర్‌ను తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ ఎస్టీ సెల్‌కు బదిలీ చేశారు.