ఆంధ్రప్రదేశ్‌

నారాయణ మెడికల్ అకాడమీలో విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి/ బి కొత్తకోట, డిసెంబర్ 12: తిరుపతి బైరాగిపట్టెడలోని నారాయణ మెడికల్ అకాడమీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న ఎం.హర్షవర్థన్ (17) మంగళవారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడని, గత కొంతకాలంగా హర్షవర్ధన్ మానసిక ఒత్తిడితో ఉన్నట్లు తోటి విద్యార్థులు అంటున్నారని కళాశాల యాజమాన్యం చెబుతోంది. అయితే తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డ బాగా చదువుతున్నాడని, ర్యాంకులు సాధించడం కోసం తమ కుమారుడిపై నారాయణ కళాశాల నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డాడని అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం పిటిఎం రోడ్డులో నివాసం ఉంటున్న శ్రీ్ధర్ రెండో కుమారుడు హర్షవర్థన్ తిరుపతిలోని నారాయణ మెడికల్ అకాడమీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం ఇంటికి వెళ్లి మంగళవారం కళాశాలకు చేరుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈనేపథ్యంలో కళాశాల నిర్వాహకులు హర్షవర్థన్ తండ్రి శ్రీ్ధర్‌కు ఫోన్ చేసి వెంటనే బయలుదేరి తిరుపతికి రావాలంటూ రాత్రి 8.45 గంటలకు ఫోన్ చేశారు. ఏం జరిగిందో చెప్పాలంటూ శ్రీ్ధర్ గట్టిగా నిలదీయడంతో విద్యార్థి మరణించిన ఫొటోలను సెల్‌ఫోన్లో పంపించారు. దీంతో ఒక్కసారిగా తల్లితండ్రులు కుప్పకూలి పోయారు. తమ బిడ్డను చంపేశారంటూ రోధించారు. ఇదిలావుండగా తనపై కళాశాలలో ఒత్తిడి పెంచుతున్నారని, ఓ విద్యార్థి నుంచి తనకు వేధింపులు ఉన్నాయని తనకు చెప్పాడని శ్రీ్ధర్ తెలిపాడు.