ఆంధ్రప్రదేశ్‌

బిల్లు ఆమోదించే వరకు ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబర్ 12: కాపులకు రిజర్వేషన్లు కల్పించడానికి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి అది ఆమోదంపొందేలా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. పార్లమెంటులో బిల్లును ఆమోదింపజేసి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ముఖ్యమంత్రికి సూచించారు. కాపులకు రిజర్వేషన్లు 2019 మార్చిలోగా అమలు కావాలని లేని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని స్పష్టంచేశారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో మంగళవారం నిర్వహించిన కాపు జెఎసి కార్యాచరణ సమావేశంలో ముద్రగడ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లపై తీర్మానించి కేంద్రానికి పంపిన నేపథ్యంలో అమలుచేస్తారన్న ఆశతో కాపులందరూ ఎదురుచూస్తున్నారన్నారు.
మూడు సంవత్సరాలుగా మొక్కవోని దీక్షతో ఉద్యమం సాగించామని, పోలీసులతో ఎన్నో విధాలుగా ఆటంకాలు కలిగించినా ఉరకలేసే ఉత్సాహంతో పాదయాత్ర చేయగలిగామన్నారు. అటువంటి ఉత్సాహం మున్ముందు రోజుల్లోనూ ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి ఒకవేళ దగాచేసిన పక్షంలో 2019 ఏప్రిల్‌లో జరిగే ఎన్నికల్లో కాపులు తమ తడాఖా చూపిస్తారని పేర్కొన్నారు. తమది కుల ఉద్యమమా? రాజకీయ ఉద్యమమా? అనేది అపుడు తేలుతుందని వ్యాఖ్యానించారు. తునిలో జరిగిన కాపుల ఐక్య గర్జన మరోసారి పునరావృతమవుతుందన్నారు. ఉద్యమంలో కాపులకు దళితులు, బీసీలు కూడా సహకరించారన్నారు. వారికి ఏ విధమైన కష్టాలొచ్చినా కాపులు సహకరించాలని సూచించారు.
బీసీలు 40 నుండి 50 శాతం రిజర్వేషన్లు కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారని, ఇందుకు వారు ప్రభుత్వంపై పోరాడితే కాపులు కూడా సహకరిస్తారన్నారు. ఇదే సమయంలో కాపులకిచ్చే రిజర్వేషన్లకు అడ్డు తగలవద్దని బీసీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్లు సాధించేవరకు అందరం మెలకువగా ఉంటూ, ముఖ్యమంత్రికి నిద్రలేకుండా చేయాలని సూచించారు. మూడేళ్ల ఉద్యమంలో అనేక అవమానాలకు గురయ్యామని వ్యాఖ్యానించారు. ఇతర కులాల పట్ల విధేయతగా ఉంటూ వారి ప్రేమను పొందాల్సివుందని ముద్రగడ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాపు జెఎసి నాయకులు ఆకుల రామకృష్ణ, కలువకొలను తాతాజీ, వాసిరెడ్డి ఏసుదాసు, 13 జిల్లాలకు చెందిన కాపు నేతలు పాల్గొన్నారు.

చిత్రం..కాపుజేఏసీ సమావేశంలో మాట్లాడుతున్న ముద్రగడ