ఆంధ్రప్రదేశ్‌

కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 12: కర్నూలు జిల్లాలో ఖాళీ అయిన స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థి ఎన్నిక తేదీ ఖరారు కావడంతో పార్టీల్లో సందడి మొదలైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో ఈ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. గత మార్చిలో జిల్లాలో స్థానిక సంస్థల శాసనమండలి సభ్యత్వానికి జరిగిన ఎన్నికల్లో శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆగస్టులో నంద్యాల శాసనసభా స్థానం నుంచి పోటీకి తన సోదరుడైన శిల్పా మోహనరెడ్డికి అవకాశం కల్పించలేదన్న కారణంతో ఆయన పార్టీ మారారు. అయితే ముందుగా టీడీపీ తరఫున దక్కించుకున్న మండలి సభ్యత్వానికి రాజీనామా చేయాలని వైకాపా అధినేత జగన్ ఆదేశించడంతో చక్రపాణిరెడ్డి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన శాసనమండలి సభ్యత్వం కోసం వైసీపీ తరఫున చక్రపాణిరెడ్డి పోటీని పోటీ చేయించేందుకు జగన్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. శిల్పా చక్రపాణిరెడ్డి పేరు దాదాపు ఖరారు కావడంతో పార్టీలో ఇతరులెవరూ టికెట్ కోసం ప్రయత్నం చేయడం లేదు.కాగా అధికార తెలుగుదేశం తరపున పోటీ చేసి సులభంగా విజయం సాధించే అవకాశముండటంతో టికెట్ కోసం ముగ్గురు, నలుగురు పోటీ పడుతున్నట్లు సమాచారం. ప్రధానంగా మాజీమంత్రి, ఎపీఐడీసీ చైర్మన్ కెయి ప్రభాకర్, నంద్యాల ఎంపీ అల్లుడు శ్రీ్ధర్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి, మాజీమంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ నాయకుల ద్వారా వెల్లడవుతోంది. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో ఎస్పీవైరెడ్డితో జరిపిన చర్చల్లో శాసనమండలి స్థానిక సంస్థల అభ్యర్థిగా అవకాశం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు నంద్యాలలో ప్రచారం జరిగింది. చంద్రబాబు ఇచ్చిన హామీ కారణంగా ఆయనకే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కుతుందన్న భావన కొందరు నేతలు వ్యక్తం చేస్తుండగా బీసీ సామాజికవర్గం వారిని సంతృప్తిపర్చడానికి ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి తన సోదరుడైన కెయి ప్రభాకర్‌కు టికెట్ ఇప్పించడానికి విశేష కృషి చేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం.
దీంతో వీరివురిలో ఒకరికి టికెట్ ఖాయమని పార్టీ నేతలు భావిస్తున్నా మాండ్ర శివానందరెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తుండటంతో పార్టీ అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలని వారు పేర్కొంటున్నారు.