ఆంధ్రప్రదేశ్‌

సిండికేట్ బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, డిసెంబర్ 12: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సిండికేట్ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న చుక్కల భరత్‌కుమార్ (26) మంగళవారం ఉదయం తన నివాస గృహంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు తన చదువు పూర్తి అయిన తర్వాత మొదటిసారిగా సిండికేట్ బ్యాంక్ మేనేజర్‌గా నరసన్నపేటలో బాధ్యతలు చేపట్టాడు. గత కొంతకాలంగా సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో బ్యాంకు అధికారుల ఒత్తిడితో దానిని సాధించలేకపోతున్నాని కుటుంబ సభ్యులకు చెబుతుండేవాడు. మృతుడి తండ్రి, సీతంపేట మండలంలో ఉపాధ్యాయుడిగా ఉన్న సీహెచ్.దుర్గాప్రసాద్, తల్లి వరలక్ష్మీ, స్థానిక సీఐ పైడిపునాయుడు భరత్‌కుమార్ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ఆత్మహత్యకు కారణాలు తెలుపుతూ పనిఒత్తిడి పెంచేలా తన ఉన్నతాధికారులు ప్రవర్తించడంతో తాను చేరుకోవాల్సిన లక్ష్యం సివిల్స్‌ను అందుకోలేకపోతున్నాన్న బాధతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైడ్ నోట్ ద్వారా తెలిపాడు.