ఆంధ్రప్రదేశ్‌

ఇటుక పేర్చకుండానే అమరావతికి సినిమా సెట్టింగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 13: గత ఎన్నికల మేనిఫెస్టోలో పలు పథకాలు ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక ప్రతి సంక్షేమ పథకాన్నీ సర్వనాశనం చేశారని వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తన పబ్బం గడుపుకునేందుకు సినిమా యాక్టర్లు, డైరెక్టర్లను వెంటబెట్టుకుని వస్తారని.. వాళ్లను చూసి మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా సంకల్పయాత్ర 34వ రోజు బుధవారం అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో కొనసాగింది. రాప్తాడులో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తూ గత ఎన్నికల్లో చిన్నచిన్న మోసాలు చేసి బాబు నమ్మించారని, వచ్చే ఎన్నికల్లో పెద్దపెద్ద మోసాలు చేసేందుకు వస్తున్నారన్నారు. ఇంటింటికీ కిలో బంగారం, ఓ కారు ఇస్తామని అంటున్నారన్నారు. ‘ఈ మధ్య ఓ డైరెక్టర్ బాహుబలి సినిమా తీశారు. చంద్రబాబు ఆయనను పిలిపించుకుని అమరావతి సినిమా తియ్యాలని చెప్పారు. ఇంకేముంది..బాహుబలి సినిమాలాగే సెట్టింగ్‌లు వేసేసి అమరావతిని సృష్టించేస్తారు. ఒక్క ఇటుక కూడా వాడకుండా బ్రహ్మాండంగా అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారన్నారు. చంద్రబాబు చాలా కష్టజీవి అని, కేంద్రమే సహకరించడం లేదని చెప్పిస్తారు.. అలాంటి డైరెక్టర్లు, నటులను ప్రశ్నించండి.. అని అన్నారు. ఇందులో మంత్రి నారాయణది మరోపాత్ర.. అదిగో అమరావతి వచ్చేసింది అంటారు.. ఏ మోసానికైనా హద్దూపద్దూ ఉండాలి అంటూ ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో ఇలాగే చంద్రబాబుకు మద్దతిచ్చారు.. ఏమైంది.. రాష్ట్రంలో అన్నీ మోసాలే.. అయ్యా యాక్టర్ గారూ.. చంద్రబాబు ఇన్ని మోసాలు చేస్తే.. అందులో నీ వాటా లేదా అని ప్రశ్నించండి అంటూ పరోక్షంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రేషన్‌షాపుల స్థానంలో విలేజ్‌మాల్స్‌ను చంద్రబాబు తీసుకొచ్చి మరో మోసానికి తెర తీశారని జగన్ ధ్వజమెత్తారు. ఇందులో నిత్యావసర సరుకులన్నీ అధిక ధరలేనన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ పాలనలో రూ.185కే రేషన్ షాపుల్లో నిత్యావసరాలు దొరికేవని, ఇప్పుడు రూ.595 పైబడే భరించాల్సి వస్తోందని అన్నారు. విలేజ్ మాల్స్ నిర్వహణను రిలయన్స్, హెరిటేజ్ సంస్థ షేర్లను అమ్మిన ఫ్యూచర్ గ్రూప్ సంస్థకు ఇస్తున్నారు. గతంలో అర కిలో రూ.6.75 ఉన్న చక్కర, విజయవాడ చంద్రన్న విలేజ్ మాల్స్‌లో రూ.25..అందులో డిస్కౌంట్ పోనూ రూ.24కు ఇస్తున్నారన్నారు. కిలో కందిపప్పు రూ.95కు అమ్ముతున్నారన్నారు.