ఆంధ్రప్రదేశ్‌

భూసేకరణ వ్యయం తడిసి మోపెడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 13: పోలవరం ప్రాజెక్టు భూసేకరణ వ్యయం తడిసి మోపెడవుతోంది. కొత్త చట్టం ప్రకారం భూసేకరణ ఖర్చు అమాంతం పెరగడంతో ప్రాజెక్టు అంచనా వ్యయం ఇంతలింతలుగా పెరిగిపోయింది. ప్రాజెక్టు ప్రారంభించేటపుడు భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సుమారు రూ.2900 కోట్లు ఖర్చవుతుందని అంచనావేశారు. అయితే కొత్త చట్టం ప్రకారం భూసేకరణ, ఆర్ అండ్ ఆర్‌కు సుమారు రూ.36వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇందులో ఒక్క భూసేకరణే సుమారు రూ.11,131 కోట్లు అవసరమవుతోంది. దీనికితోడు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వ్యయం సైతం భారీగా పెరిగిపోవడంతో ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం ఊహించని విధంగా పెరిగిపోయి, అందరిలోనూ సందేహాలను, ప్రాజెక్టు భవితవ్యాన్ని అయోమంలోకి నెట్టేసింది.వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిపి, పనులు ప్రారంభించిన సంగతి విదితమే. ప్రాజెక్టు పనుల ప్రారంభ సమయంలో భూసేకరణకు సుమారు వెయ్యి కోట్ల మేర అవసరమవుతుందని అంచనా. అప్పట్లో ఎకరాకు కనిష్ఠంగా రూ.35 వేల నుండి గరిష్ఠంగా 1.85 లక్షల వరకు పరిహారం చెల్లించారు. ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన హెడ్‌వర్క్స్ నిర్మాణానికి అవసరమైన 256 ఎకరాల భూమిని సేకరించడానికి అప్పట్లో సుమారు రూ.3.33 కోట్లు మాత్రమే చెల్లించారు. అంటే ఎకరాకు సుమారు రూ.1.3 లక్షలు మాత్రమే ఖర్చయ్యింది. ఇదంతా అప్పట్లో అయా గ్రామాల పరిధిలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా నిర్ణయించిన పరిహారమే. తాజాగా 2014 జనవరి 1 నుండి అమల్లోకి వచ్చిన కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ఇపుడు అదే ప్రాంతంలో రెండో విడత ముంపు గ్రామాల్లో ఎకరాకు రూ.10.50 లక్షల వరకు పరిహారం ఇవ్వాల్సివస్తోంది. 2014 జనవరి 1 ఒకటి తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన భూములకు కొత్త చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తున్నారు. అంతకు ముందు నోటిఫికేషన్ ద్వారా సేకరించిన భూములకు మాత్రం పాత చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తున్నారు. ప్రస్తుతం విలీన మండలాల్లో భూసేకరణ జరుగుతోంది. మొదటి విడత గ్రామాలకు సంబంధించి ఇంకా భూములకు నష్టపరిహారం, పునరావాస, పునర్నిర్మాణ ప్రక్రియ జరుగుతోంది. మొత్తం ఉభయ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల పరిధిలో 1,65,431 ఎకరాల భూమి అవసరం కాగా, ఇప్పటి వరకు 1,04,065 ఎకరాలు సేకరించారు. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు రూ.4234 కోట్లు చెల్లించారు. ఇంకా 61,363 ఎకరాలు సేకరించాల్సి ఉండగా, ఇంకా సుమారు రూ.6897 కోట్లు అవసరమవుతుంది. అదే విధంగా పునరావాసానికి సంబంధించి కూడా కొత్త చట్టం ప్రకారం భారీ స్థాయిలో చెల్లించాల్సివుంది. సేకరించిన భూములకు సంబంధించి నిర్వాసితులకు భూమికి భూమి కేటాయించేందుకు జిల్లాల వారీగా భూములను నిర్దేశించారు. నిర్వాసితులకు అనువైన, ఇష్టపడిన భూములను భూమికి భూమి ప్రత్యామ్నాయ విధానంలో కేటాయించాల్సి వుంది. రెండున్నర ఎకరాల వరకు భూమికి భూమిని కేటాయించి, ఆపై భూమికి నష్టపరిహారం చెల్లించాల్సివుంది. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో భూమికి భూమి కింద మొత్తం 20,525 ఎకరాలు సేకరించగా అందులో ఇప్పటి వరకు 781 ఎకరాలు పంపిణీచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో 8184 ఎకరాలు సేకరించగా ఈ జిల్లాలో మాత్రం భూమికి భూమి విధానంలో మొత్తం కేటాయింపు పూర్తయింది. విశాఖ, కృష్ణా జిల్లాల్లో అవసరమైన భూసేకరణ పూర్తయింది. నష్టపరిహారం కూడా ఈ రెండు జిల్లాల్లో చెల్లింపు ప్రక్రియ పూర్తయింది.