ఆంధ్రప్రదేశ్‌

ఆస్తులు ధ్వంసం చేస్తే కేసులు పెట్టరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్,జూన్ 9:ప్రభుత్వ ఆస్తులు ధ్వంసంచేస్తే కేసులు పెట్టరా అని రాష్ట్ర దేవాదాయశాఖమంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. గురువారం స్థానిక కాపుకల్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో వికాసపర్వ్ సమావేశం జరిగింది. ఈసమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ కాపులను బిసిల్లో చేర్చాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కిర్లంపూడిలో చేపట్టిన ఆందోళన కార్యక్రమం సందర్భంగా కొంతమంది అల్లరిమూకలు రైలును తగలబెట్టిన ఘటనలో కొంతమందిని అరెస్టు చేశారన్నారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినప్పుడు ఎంతటివారిపైనైనా కేసులు పెట్టాల్సివస్తుందన్నారు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం లేదనిస్పష్టం చేశారు. కాపుల అభ్యున్నతికి కమిషన్ వేసిన సంగతి గుర్తుచేస్తూ కమిషన్ నివేదిక రాగానే ప్రభుత్వం స్పందిస్తుందంటూ ఇలాంటి పరిస్ధితుల్లో ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన కాపునేతలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చూస్తు ఊరుకోరని హెచ్చరించారు. ఈసందర్భంగా కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి మాట్లాడుతూ రామాయపట్నం పోర్టుకు సంబంధించి తెలుగుదేశంపార్టీ నేతలు అవగాహన లేక రకరకాలుగా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదువేల ఎకరాలు భూసేకరణ చేసి కేంద్రానికి అప్పగిస్తే రామాయపట్నం పోర్టుకు కేంద్రం పునాదిరాయి వేస్తుందని స్పష్టం చేశారు.