ఆంధ్రప్రదేశ్‌

ప్రతి అర్జీనీ పరిష్కరించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 14: ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచడమే లక్ష్యంగా ‘రియల్ టైమ్ గవర్నెన్స్’ ప్రవేశ పెట్టామని, అధికారులు మరింత జవాబుదారీతనంతో పనిచేసినప్పుడే ఇది సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. విధులను సమర్థంగా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తున్నామని, ప్రజల సంతృప్తే పరమావధిగా పనిచేయాలని సూచించారు. ప్రజా వినతుల్లో ప్రతి సమస్యను పరిష్కరించాలని, ముందుగా ఆర్థికేతర వినతులపై దృష్టి పెట్టాలని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే జన్మభూమికల్లా వినతులను పరిష్కరించాలని ఆదేశించారు. వినతుల పరిష్కారంలో ప్రజా సంతృప్తి ప్రస్తుతం 59 శాతమే వుందని, దీనిని 80 శాతానికి తీసుకువెళ్లాలని సూచించారు. జన్మభూమి కార్యక్రమం జరిగే పది రోజులు పది థీమ్‌లతో పనిచేయాలని చెప్పారు.గురువారం సచివాలయంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ రియల్ టైమ్ గవర్నెన్స్,
ఇ-ఆఫీసు, ప్రజా వినతుల పరిష్కారంపై జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల విభాగాధిపతులు, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఓడీఎఫ్ సంపూర్ణం కావడాన్ని అభినందించిన ముఖ్యమంత్రి, మార్చి 31 కల్లా స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాకారం కావాలని అధికారులకు నిర్దేశించారు. ఓడీఎఫ్ సాధనలో అత్యంత వెనుకబడి వుండటానికి గల కారణాలను జిల్లాల కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఓడీఎఫ్‌తో పాటు వ్యర్థాల నిర్వహణ సమర్థంగా చేపట్టాలని చెప్పారు. గడచిన 15 రోజుల్లో సుమారు 521 గ్రామాలను ఓడీఎఫ్‌గా ప్రకటించగా, ఇందుకోసం రూ.150 కోట్లు ఖర్చు చేశామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఇప్పటివరకు 5 జిల్లాలను, 5,746 గ్రామాలను ఓడీఎఫ్‌గా ప్రకటించామని, మరో నాలుగు రోజుల్లో గుంటూరు జిల్లాను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. మిగిలిన 7 జిల్లాలను ఓడీఎఫ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇంకా 16,36,713 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాల్సి వుందని, ఇప్పటివరకు 77 శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయ్యిందని అధికారులు వివరించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో 94 శాతం మంది సంతృప్తితో ఉన్నారని వెల్లడించారు.
విద్యార్థులకు సామాజిక సేవ చేసే అవకాశం స్వచ్ఛాంద్రప్రదేశ్ రూపంలో దక్కింది, దీనిని అందరూ వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడమే కాదు వాటిని వినియోగించేలా ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. లోటు నుంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దామని, విద్యుత్ చార్జీలు ఎట్టిపరిస్థితుల్లో పెంచేదిలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 24 గంటలు విద్యుత్ సరఫరా, 100 శాతం గ్యాస్ కనెక్షన్లు ప్రభుత్వ విజయాలని అన్నారు. నూరుశాతం ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటుపై దృష్టిపెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

చిత్రం..కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు