ఆంధ్రప్రదేశ్‌

20 శాతం హెచ్‌ఆర్‌ఏ జీవో విడుదలపై హర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 15: శ్రీకాకుళం, చిత్తూరు, మచిలీపట్నం జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి అద్దె భత్యాన్ని 20 శాతానికి పెంచి, 2018 జనవరి నుండి అమలుచేసేలా ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేయటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడును ఏపీ ఎన్‌జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.అశోక్‌బాబు, ఎన్.చంద్రశేఖరరెడ్డి, డివి రమణ తదితరులు శుక్రవారం వెలగపూడి సచివాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపి, ఇతర సమస్యలపై చర్చించారు. ఉద్యోగులకు పీఆర్‌సీ బకాయిల చెల్లింపులపై ఇప్పటికే కాలయాపన జరిగిందని, బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రెండు విడతల డీఏ బకాయిలు కూడా చెల్లించేందుకు కృషిచేయాలని కోరారు.