ఆంధ్రప్రదేశ్‌

రేషన్ షాపుల ఇళ్లకు పన్ను మినహాయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 15: రేషన్ షాపులు నిర్వహిస్తున్న ఇళ్లకు వాణిజ్య పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏపీ రేషన్ డీలర్ల సంక్షేమ సమాఖ్య కార్యవర్గ సభ్యులు విజ్ఞప్తి చేశారు. వెలగపూడిలో శుక్రవారం సీఎంను వారు కలిసి, అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులు పంపిణీ బకాయిలు చెల్లించాలని కోరారు. రేషన్ దుకాణాలను మీసేవా కేంద్రాలుగా మార్చాలని, వినియోగ చార్జీలను తమకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. డీలర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని, సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విజ్ఞప్తులను పరిశీలిస్తానని వారికి సీఎం హామీ ఇచ్చారు. చంద్రన్న మాల్స్‌ను ఇంకా మెరుగ్గా ఎలా తీర్చిదిద్దవచ్చో సూచనలను కూడా సీఎం విన్నారు. సీఎంను కలిసిన వారిలో ఆ సమాఖ్య ప్రతినిధులు దివి లీలా మాధవరావు, గంగాధర్, తదితరులు ఉన్నారు.